సిటీలో మోసాల గురించి ప్రజల్ని అలెర్ట్ చేసేందుకు.. ట్రాఫిక్ నియమాల గురించి ప్రచారం చేసేందుకు పోలీసులు సెలబ్రిటీల్ని ఆశ్రయిస్తున్నారు. మన యువహీరోలు.. ప్రముఖ దర్శకులు కూడా సిటీ కమీషనర్ కి ఈ మంచి కాజ్ కోసం అంతే ఇదిగా సాయపడుతున్నారు.
ఇప్పటికే పలుమార్లు పోలీసులు నిర్వహించిన ప్రజా అవగాహనా కార్యక్రమాలకు వెళ్లి ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం చేశారు కొందరు. పలువురు స్టార్లు ప్రభుత్వ వాణిజ్య ప్రకటనల్లోనూ నటించారు. ముఖ్యంగా హీరో సుధీర్ బాబు ఇతరులతో పోలిస్తే.. పోలీస్ డిపార్ట్ మెంట్ కి మరింతగా సాయపడుతున్నారు . ప్రతిసారీ అతడు పోలీస్ కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. సైబరాబాద్ సిటీ కమీషనర్ సజ్జనార్ పిలుపునందుకుని నేడు రిపబ్లిక్ డే వేడుకల్లోనూ సుధీర్ బాబు పాల్గొన్నారు. అలాగే దీనిపై ఎన్టీవీ స్పెషల్ గా షోని కూడా ప్లాన్ చేసింది.
హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియా.. మన సంరక్షక దేవదూతలతో గడిపిన రోజు !!! ఇది అంటూ సుధీర్ బాబు ఆనందం వ్యక్తం చేస్తూ కమీషనర్ సజ్జనార్ సాంగత్యంలో చాలా నేర్చుకోవడానికి ప్రేరణ పొందటానికి ఆస్కారం ఉందని అన్నారు. 5PM నుండి ఎన్టీవీ తెలుగులో హైదరాబాద్ సిటీపోలీస్ తో నా కార్యక్రమం చూడండి! అని సుధీర్ తెలిపారు. తన అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పారు.
వీ చిత్రం తర్వాత సుధీర్ బాబు-ఇంద్రగంటి కొత్త చిత్రం జనవరి 4న ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి కథానాయికగా నటిస్తోంది. మహేంద్ర బాబు - కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ స్వరకర్త వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెలా గోపిచంద్ ఆధారంగా తెరకెక్కించనున్న బయోపిక్ లోనూ సుధీర్ బాబు కనిపించనున్నారు.