బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు (శ్వేతాబచ్చన్ నందా కుమారుడు) అగస్త్య నందా .. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ నటవారసురాలు సుహానా ఖాన్ డేటింగ్ లో ఉన్నారా? ఈ జంట ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు బాలీవుడ్ మీడియాలో జోరుగా కథనాలు వైరల్ అవుతున్నాయి.
ఈ జంట జోయా అక్తర్ తెరకెక్కిస్తున్న 'ది ఆర్చీస్' సెట్స్ లో అత్యంత సన్నిహితంగా మారిపోయారు. అప్పటి నుంచి ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఒకరి స్నేహాన్ని ఒకరు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. సెట్లోను ఎక్కువ సమయం కలిసే కనిపించడం అందరి కంటా పడింది. అంతేకాదు....ఒక ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం.. అగస్త్య నంద తమ కుటుంబంలో జరిగిన క్రిస్మస్ బ్రంచ్ లో సుహానా ఖాన్ ను తన 'భాగస్వామి'గా పరిచయం చేశాడు.
కొంతకాలంగా ఈ జంటపై పుకార్లు వస్తున్నా..అవన్నీ గాసిప్స్ మాత్రమేనని అంతా భావించారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. 'ది ఆర్చీస్' సెట్స్ నుండి అందిన లీకుల ప్రకారం.. సుహానా ఖాన్ - అగస్త్య నందా సంబంధంలో ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా (22).. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య (22)తో కలిసి కపూర్ కుటుంబం.. అగస్త్య తండ్రి తరపు వారు నిర్వహించిన క్రిస్మస్ బ్రంచ్ కి వెళ్లారు. ''అగస్త్య తన కుటుంబ సభ్యులందరికీ సుహానాను తన భాగస్వామిగా పరిచయం చేసాడు'' అని బాలీవుడ్ మీడియా కథనాలు ఉటంకిస్తున్నాయి.
ఈ వ్యవహారం జోయా అక్తర్ చిత్రం సెట్లో ప్రారంభమైంది. ఈ జంట కలిసి నటిస్తున్న తొలి సినిమా ది ఆర్చీస్. ఆన్ లొకేషన్ ఆఫ్ ద లొకేషన్ ఈ అందమైన జంట కలిసి ఎక్కువ సమయం గడుపుతారు. వారి బంధాన్ని దాచడానికి కూడా ప్రయత్నించరు. వారు దీన్ని ఇంకా అధికారికం చేయడానికి ప్లాన్ చేయకపోయినా కానీ 'ది ఆర్చీస్' ప్రొడక్షన్ హౌస్ లోని చాలా మంది వ్యక్తులు ఆగస్టు 2022లో ఈ జంట చనువుగా ఉండడాన్ని గుర్తించారు. ఆ తర్వాతా ఎక్కువ సేపు కలిసే కనిపించడం సందేహాలు రేకెత్తించిందని సోర్స్ చెబుతోంది.
అగస్త్య తల్లి శ్వేతా నందా బచ్చన్ కి సుహానా ఖాన్ అంటే అమితమైన ప్రేమాభిమానం. ఆమె సుహానాను ప్రేమిస్తుంది. అంతేకాదు ఈ స్టార్ స్టడ్ సంబంధానికి తన ఆమోదం తెలిపింది. అయితే అగస్త్య నందా కానీ.. సుహానా ఖాన్ కానీ... వారి తరపు బంధుమిత్రులు కానీ దీనిని అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతానికి ది ఆర్చీస్ ఆన్ లొకేషన్ సాన్నిహిత్యం ఆధారంగా సాగుతున్న ఊహాగానాలు మాత్రమే. ఒకరు బచ్చన్ ఫ్యామిలీ నుంచి మరొకరు కపూర్ ఫ్యామిలీ నుంచి రిలేషన్ షిప్ లో ఉండడం పెద్దగా విచిత్రం కాదని కూడా గుసగుసలు వైరల్ అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.