ఫోటో స్టోరీ: సుహానా త‌కిదిమితోం!

Update: 2018-09-09 08:01 GMT
కింగ్ ఖాన్ బాలీవుడ్‌ని ఏల్తున్న సంగ‌తి తెలిసిందే. వేల‌కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తిగా - రెడ్ చిల్లీస్ అధినేత‌గా అత‌డు సాగిస్తున్న ఆట మామూలుగా లేదు. ఇక్క‌డ ఆడేవాడిదే ఆట‌. పాడేవాడిదే పాట‌. ద‌శాబ్ధాలుగా ఈ ఆట‌లో అలుప‌న్న‌దే లేకుండా ముందుకు సాగుతున్నాడు. ఎంత‌యినా 50 ప్ల‌స్ వ‌య‌సుకు వ‌చ్చేయ‌డంతో ఇంకా ఎంత‌కాలం ఆడ‌గ‌ల‌డు. అందుకే త‌న గారాల ప‌ట్టీ సుహానాని బ‌రిలో దించుతున్నాడు. కుమారుడు ఆర్య‌న్ ఖాన్ ఇంకా టీనేజీ గ‌య్ కాబ‌ట్టి అత‌డు బ‌రిలోకి వ‌చ్చేప్ప‌టికి చాలానే ఆల‌స్య‌మ‌య్యేట్టు ఉంది. అత‌డు వ‌చ్చేలోగానే సుహానాని క‌థానాయిక‌గా ఎస్టాబ్లిష్ చేసి ఛ‌రిష్మాటిక్ ప్ర‌పంచంలో త‌న‌కు ఓ స్థానం క‌ట్ట‌బెట్టాల‌న్న‌ది డాడ్‌గా షారూక్ ఆలోచ‌న‌.

ఆ క్ర‌మంలోనే సుహానాకి క‌ర‌ణ్ సార‌థ్యంలో యాక్టింగ్ టిప్స్ తీసుకునేందుకు ప్లాన్ చేశాడు. రీసెంట్‌గానే ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై షాకిచ్చే ఫోజుల‌తో చెల‌రేగిపోయింది సుహానా. 24 గంట‌ల పాటు కేవ‌లం ఫోటోషూట్‌కే అంకిత‌మైంది ఈ స్టార్‌కిడ్. ఆ ఫోటోలు వెబ్‌లో హోరెత్తిపోయాయి. సుహానా ఏ ఇత‌ర స్టార్ హీరోయిన్‌కి తీసిపోని కాన్ఫిడెన్స్‌తో క‌నిపించింది. ఎంత‌మంది బ‌రిలో ఉన్నా బంతి మాత్రం త‌న కోర్టులోనే ఉంద‌న్న కాన్ఫిడెన్స్ త‌న‌లో ఇనుమ‌డించింది.

ఇదిగో అప్ప‌టి ఫోటోషూట్‌ లో కొన్ని ఫోటోలు తాజాగా లీక‌య్యాయి. వీటిలో సుహానా వైబ్రేంట్ అప్పియ‌రెన్స్ మ‌తి చెడ‌గొడుతోంది. సుహానా ఆడితే ఎలా ఉంటుంది? అంటే నెమ‌లి పురివిప్పి నాట్య‌మాడిన‌ట్టే ఉంటుంది.. అని చెప్పుకునేలా ఈ ఫోటోషూట్ ఎలివేట్ చేసింది. గుండె కొల్ల‌గొట్టే కిల్లాడి లుక్స్‌తో ఝ‌డిపించేసిందంటే న‌మ్మండి. ఈ రేర్ పిక్స్ మీకోసం..సుహానా త‌కిదిమితోం వీక్షించండి.. ప్ర‌స్తుతానికి ఇది శాంపిల్ మాత్ర‌మే. ఇప్పుడు కాదు.. విదేశీ చ‌దువు పూర్త‌య్యాక ఉంటుంది అస‌లు పండ‌గ‌! జ‌స్ట్ వెయిట్‌..
Tags:    

Similar News