కింగ్ ఖాన్ షారూక్ తన నటవారసురాలు సుహానా ఖాన్ ని కథానాయికగా బరిలో దించేదెపుడు? ఓవైపు స్టార్ కిడ్స్ వెల్లువలా దూసుకొస్తున్నారు. అప్పుడే శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ నట ప్రవేశంపై పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంటే ఇంకా బాద్ షా ఎందుకనో సుహానా ఆరంగేట్రంపై ఏదీ చెప్పడం లేదు. మామ్ గౌరీ ఖాన్ కూడా ఇంకా సుహానా నట ప్రవేశంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం వెనక కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు.
మరోవైపు స్టార్ కాకముందే సుహానాకి ఒక పెద్ద స్టార్ హీరోయిన్ కి ఉన్నంతగా ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టా సహా సోషల్ మీడియాల్లో తనకు వీరాభిమానులున్నారు. షారూఖ్ ఖాన్ కుమార్తె గా సుహానా ఇప్పటికే సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయ్యారు. ఈ రిచెస్ట్ స్టార్ కిడ్ తరచుగా తన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తూ భారీ ఫాలోయింగ్ ని పెంచుకుంది.
సుహానా తన న్యూయార్క్ అపార్ట్ మెంట్ నుండి తాజాగా సూర్యాస్తమయం వేళ ఒక అందమైన దృశ్యాన్ని షేర్ చేసింది. దాంతో పాటే తన గ్లామరస్ ఫోటోని కూడా అభిమానులకు పంచుకుంది. కిల్లింగ్ హాట్ లుక్ ఇది. సుహానా బ్లాక్ ఫ్రాకులో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక బ్లాక్ ఫ్రాక్ కలర్ కి మ్యాచింగ్ లెదర్ హ్యాండ్ బ్యాగ్ ని ధరించి వాలు చూపులతో కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. సుహానా గోధుమ వర్ణంలో కనిపిస్తున్నా బాద్ షా రేంజులో బాలీవుడ్ ని ఏలడం ఖాయమని అభిమానం వ్యక్తమవుతోంది.
ఇటీవల సుహానా ఖాన్ తన 21 వ పుట్టినరోజును జరుపుకోగా తన డెబ్యూ మూవీ గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తిని కనబరిచారు.
ఇక సుహానా తెరంగేట్రం చేసినా తనదైన మార్క్ వేయాలనుకుంటోంది. ఇంతకుముందు ప్రఖ్యాత వోగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహానా తన తండ్రి ప్రజాదరణ ప్రభావం తనపై పడకూడదని కోరుకుంటున్నట్టు వెల్లడించింది. ``నాన్న ఫేమస్ కావడం గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నాన్న స్వయంగా వచ్చి నన్ను పాఠశాలలో వదిలి వెళ్లేవారు. స్కూల్ కి వెళ్లాక అతడిని నాన్న అని పిలువను. తను కౌగిలించుకునేందుకు ముందుకు వస్తే నెట్టేస్తాను. ఎందుకంటే పరుల కళ్లు పడకూడదనే.. అది నాకు ఇష్టం లేదు`` అని సుహానా వెల్లడించింది. అంటే బాలీవుడ్ లో తనకు తానుగానే సుహానా ఎదగాలని ఆశిస్తున్నట్టు... తనదైన ఇండివిడ్యువాలిటీని కోరుకుంటోందని తన మాటల్ని బట్టి అర్థం చేసుకోవాలి.