నయన్ మటక్కా సాంగ్.. కీర్తి సురేష్ వేరే లెవెల్ లో..

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2024-11-23 18:33 GMT

సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని చూస్తున్నారు కీర్తి సురేష్. బీటౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్ సరసన బేబీ జాన్ సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీతోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే బేబీ జాన్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఆడియన్స్ లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

కలీస్ దర్శకత్వం వహిస్తున్న బేబీ జాన్ మూవీని జియో స్టూడియోస్‌, అట్లీ, సినీ వన్ స్టూడియోస్‌ బ్యానర్లపై మురద్‌ ఖేతానీ, ప్రియా అట్లీ, జ్యోతీ దేశ్‌ పాండే నిర్మిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ఇప్పుడు అంతా రెడీ అయింది. మరో రెండు రోజుల్లో నయన్ మటక్క సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా నేడు ప్రోమో విడుదల చేశారు.

ఇర్షద్ కమిల్ లిరిక్స్ అందించిన నయన్ మటక్క సాంగ్ ను దిల్జిత్‌ దోసంజ్‌, దీక్షిత వెంకడేశన్‌ ఢీ కలిసి ఆలపించారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్‌ బాణీలు కట్టారు. దిల్జిత్‌ వాయిస్‌.. ఎలక్ట్రిఫైయింగ్‌ బీట్‌ కు పెర్ఫెక్ట్ సెట్ అయింది. ఆస్ట్రేలియన్‌ సింగర్‌ గా, కంపోజర్‌ గా మంచి పేరు సంపాదించుకున్న ఢీ తన వాయిస్ తో సాంగ్ మ్యాజిక్ ను యాడ్ చేశారు.

అయితే సాంగ్ లో వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేష్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ అదుర్స్ అనే ఇప్పటికే టాక్ వినిపించింది. ఇప్పుడు ప్రోమో రిలీజ్ తర్వాత అది ప్రూవ్ అయింది. కీర్తి తన ఎక్స్ప్రెషన్స్ తో అదరగొట్టారు. వరుణ్ సరసన దుమ్ము దులిపేశారు. సెగలు పుట్టించే స్టెప్పులతో సందడి చేశారు. కీర్తి కెరీర్ లో ఇంత ఎనర్జిటిక్ గా కనపడడం ఇదే తొలిసారి అని చెప్పాలి. మొత్తానికి ప్రోమో ఫుల్ వైరల్ అవుతోంది.

ఓవరాల్ సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కీర్తి సురేష్ అదరగొట్టేశారని చెబుతున్నారు. బాలీవుడ్ లో సత్తా చాటడం పక్కా అని అంటున్నారు. నయన్‌ మటక్క ట్రాక్‌ ఫుట్‌ ట్యాపింగ్‌ గా ఉండబోతున్నట్లు అర్థమవుతోందని చెబుతున్నారు. సాంగ్ తో మూవీపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు.

ఇక సినిమాలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ తో పాటు వామిక గబ్బి కీలక పాత్ర పోషిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 25న థియేటర్లలోకి సినిమా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు. మరి బాలీవుడ్ డెబ్యూతో కీర్తి సురేష్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News