దేవరకొండ డబుల్ స్ట్రైక్.. ఆ రెండు ఒకేసారి
ఈ నెలాఖరుకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మే 30న సినిమా రిలీజ్ కానుంది.;
విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవకపోవడంతో, ఇప్పుడు పూర్తిగా తన లైనప్‌ను స్ట్రాంగ్‌గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం కింగ్‌డమ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరుకల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మే 30న సినిమా రిలీజ్ కానుంది.
ఆ వెంటనే రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టిన విజయ్, దాన్ని వచ్చే నెల నుంచే మొదలు పెట్టబోతున్నాడు. వరుసగా రెండు సినిమాల షూటింగ్‌లు షెడ్యూల్ అవుతుండటంతో అతని కెరీర్‌లో మళ్లీ యూత్‌ఫుల్ ఎనర్జీ కనిపించనుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా విజయ్‌కు లైన్‌లో ఉంది. అదే దిల్ రాజు – రవికిరణ్ కోలా కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా.
ఇటీవలే దిల్ రాజు స్వయంగా ఈ ప్రాజెక్ట్‌ను కన్ఫర్మ్ చేయడంతో, ఇది త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని అర్థమైంది. ముఖ్యంగా ఈ రెండు సినిమాలు ఒకేసారి ప్రారంభం కాబోతుండటంతో విజయ్ దేవరకొండ పూర్తిగా తన కెరీర్‌పై ఫోకస్ పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. అంటే అతను ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్‌లను ఒకేసారి హ్యాండిల్ చేయనున్నాడన్న మాట.
విజయ్ ఎప్పుడూ కొత్త కథలను ఎంచుకునే హీరో. రాహుల్ దర్శకత్వంలో రాబోయే సినిమా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందబోతుందని టాక్. రాహుల్ సంకృత్యన్ తన గత సినిమాలు చూసుకుంటే, కంటెంట్ పరంగా డిఫరెంట్ అనిపించే కథలను తీసుకోవడం కామన్. శ్యామ్ సింగ రాయ్ సినిమాలోనూ అటువంటి కొత్త టచ్ పెట్టిన రాహుల్, ఇప్పుడు విజయ్‌ను కూడా మరింత కొత్త తరహాలో చూపించబోతున్నాడని టాక్.
మరోవైపు రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమా కూడా పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు విజయ్ ఎక్కువగా లవ్ స్టోరీలు, యూత్‌ఫుల్ ఎంటర్టైనర్స్ చేసినా, ఇప్పుడు మాస్ అండ్ యాక్షన్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. గతంలో వచ్చిన టాక్సీవాలా లాంటి సినిమాలు అతనికి మంచి మార్కెట్‌ని తీసుకొచ్చాయి. అదే మళ్లీ ఇప్పుడు రాహుల్ - రవికిరణ్ కోలా సినిమాలతో రిపీట్ అవుతుందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు సినిమాలు విజయవంతమైతే, విజయ్ తన స్టార్ స్టేటస్‌ను మరింత స్ట్రాంగ్ చేసుకునే అవకాశం ఉంది.
కింగ్‌డమ్ పూర్తవ్వగానే, ఒకేసారి రెండు సినిమాలు చేయడం కాస్త రిస్క్ అనే అనిపించినా, విజయ్ ఆ ఉత్సాహాన్ని చూపిస్తే లాంగ్ రన్‌లో ఇది అతనికి పెద్ద ప్లస్ అవుతుంది. ముఖ్యంగా యూత్‌లో అతనికి ఉన్న క్రేజ్, అగ్ర దర్శకులు, నిర్మాణ సంస్థలతో పనిచేసే ఛాన్స్ రావడం చూస్తే, ఈసారి మాత్రం విజయ్ చాలా బలమైన ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటాయో చూడాలి.