చిరూ మాటలకు షాకైన నాని.. ఏమన్నారంటే
మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చిరంజీవి మంచి టైమింగ్ మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటారు.;
మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా చిరంజీవి మంచి టైమింగ్ మెయిన్‌టెయిన్ చేస్తూ ఉంటారు. దాని వల్లే ఆయన ఏం మాట్లాడినా చాలా సహజంగా ఉంటుంది. ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా చిరూతో జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను వెల్లడించి మరోసారి చిరూ టైమింగ్ గురించి అందరికీ తెలియచేశారు.
కోర్టు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని ఈ విషయాన్ని బయటపెట్టారు. నాగ చైతన్య పెళ్లి దగ్గర జరిగిన ఓ ఫన్నీ మూమెంట్‌ను నాని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను కారు దిగి లోపలికి ఎంటరవుతున్న టైమ్ లో చిరంజీవి గారు బయటికొస్తూ ప్రొడ్యూసర్ గారూ అంటూ దండం పెట్టబోయారని తెలిపారు.
వెంటనే తాను చుట్టూ చూశానని, తన వెనుక ఎవరైనా నిర్మాతలున్నారేమో, అశ్వినీదత్ గారేమైనా వచ్చారా అని చూశానని కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో చిరంజీవి గారిని చూసేసరికి ఆయన నవ్వి అవును మీరే సర్ అంటూ తనను హగ్ చేసుకున్నారని నాని తెలిపారు. నాని షేర్ చేసుకున్న ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ ఇంటర్వ్యూలో నానితో కలిసి ప్రియదర్శితోపాటూ కోర్టు చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు. ప్రియదర్శి కూడా చిరూ గురించి ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడే చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను. ఆయన నన్ను చూసి సూట్ లో చాలా బాగున్నావు అన్నారని ప్రియదర్శి తెలిపారు. కోర్టు సినిమా చేస్తున్నా సార్ అనగానే నాని కదా ఇక అయిపోతుందిలే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారని, చిరూ లాంటి గొప్ప వ్యక్తి చెప్పడంతో తనకు చాలా సంతోషమేసిందని ప్రియదర్శి అన్నారు.
నాని నిర్మాణంలో రూపొందిన కోర్టు సినిమా మార్చి 14న రిలీజ్ కానుండగా, చిరంజీవితో కూడా నాని ఓ సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి నటించనున్న సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందుకే నానిని ప్రొడ్యూసర్ గారూ అని చిరూ పిలిచారు.