KCPD: కిరణ్ అబ్బవరం మాస్ మోడ్..
ఈ చిత్రం హోలీ సందర్భంగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.;
యూత్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం తన సినిమాలతో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. లవ్ స్టోరీలు, మాస్ ఎంటర్టైనర్స్, ఫ్యామిలీ డ్రామాలు ఇలా అన్నిరకాల కథలను టచ్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు ‘దిల్‌రూబా’తో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం హోలీ సందర్భంగా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
అయితే ఈ సినిమా మూడో సింగిల్‌గా విడుదలైన ‘కేసీపీడీ’ ఇప్పుడు మ్యూజిక్ చార్ట్‌లో దూసుకెళ్తోంది. సాంగ్‌ను చూస్తే కిరణ్ అబ్బవరం ఈసారి కంప్లీట్ మాస్ యాక్షన్ అవతార్‌లో కనబడబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కిరణ్ రొమాంటిక్ హీరోగా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కానీ ఈసారి పూర్తిగా మాస్ అవతార్‌లోకి వచ్చేశాడు.
‘కేసీపీడీ’ అనే ఈ నాలుగో సింగిల్ మాస్ బీట్ సాంగ్‌గా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో హై ఎనర్జీ వాతావరణం ఉండేలా కంపోజ్ చేశారు. ముఖ్యంగా ఈ సాంగ్ సినిమాకు యాక్షన్ మూడ్‌ను పెంచేలా ఉంది. సాంగ్ విజువల్స్ చూస్తే హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. లవ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుందనే విషయానికి ఈ పాట ద్వారా క్లారిటీ వచ్చింది.
కిరణ్ అబ్బవరం హార్డ్ హిట్టింగ్ యాక్షన్ లుక్స్, స్టైలిష్ ప్రెజెన్స్ చూస్తుంటే.. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ కనిపించని ఓ కొత్త యాంగిల్‌ను చూస్తున్నట్లు అనిపిస్తోంది. స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మాస్ క్యారెక్టర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. ‘కేసీపీడీ’ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘దిల్‌రూబా’కు మంచి మ్యూజిక్ అందించిన సామ్ సీఎస్, తన స్టైల్‌ను చూపించాడు.
యాక్షన్, థ్రిల్లర్ మూవీస్‌కు ఆయన సంగీతం ఓ ప్రధాన హైలైట్‌గా మారింది. ఈ సాంగ్ కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో నెక్స్ట్ లెవెల్ ఎనర్జీను తీసుకొచ్చింది. మాస్ బీట్ లిరిక్స్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, మొదటి రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచగా, ‘కేసీపీడీ’ మాత్రం సినిమాకు పూర్తిగా మాస్ ఫ్లేవర్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని స్పష్టమవుతోంది. ఇక ‘దిల్‌రూబా’ ఫలితం ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే, మార్చి 14 వరకు ఆగాల్సిందే.