టెన్షన్ లో సుక్కూ అండ్ టీమ్..?

Update: 2022-05-10 03:28 GMT
ఇటీవల కాలంలో బాలీవుడ్ మార్కెట్ లో సత్తా చాటిన సౌత్ సినిమాలలో ''పుష్ప: ది రైజ్'' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. హిందీలో ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఏ భారతీయ సినిమా కూడా వెళ్ళని ప్రదేశాలకు 'పుష్ప' పార్ట్-1 వెళ్ళింది. ఇది ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించిందనేది వాస్తవం. ఇందులో 'తగ్గేదేలే' అనే బన్నీ మ్యానరిజాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ వరకు ఎంతోమంది ఫాలో అయ్యారు. దీంతో ఇప్పుడు రెండో భాగం ''పుష్ప: ది రూల్'' పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే 'పుష్ప 2' సినిమాపై ఏర్పడిన భారీ అంచనాల కారణంగా సుకుమార్ అండ్ టీమ్ చాలా టెన్షన్ పడుతున్నారని టాక్ వినిపిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని రెండో భాగానికి పగడ్బంధీగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని.. అంచనాలను చేరుకోవడానికి అన్ని మార్గాలను కనుగొంటున్నారని  అంటున్నారు.

'బాహుబలి' తర్వాత వచ్చిన 'బాహుబలి 2'.. 'కేజీయఫ్' ప్రాంఛైజీలో వచ్చిన చాప్టర్-2 సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. ఏమాత్రం అంచనాలు తగ్గకుండా తెరకెక్కించారు కాబట్టే.. ఒకటి రెండు వేల కోట్లు మరొకటి వెయ్యి కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టాయి. ఇప్పుడు అందరి ఫోకస్ 'పుష్ప' కు కొనసాగింపుగా రానున్న 'పుష్ప 2' పై ఉంది.

'పుష్ప: ది రూల్' సినిమా కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొదటి పార్ట్ మీద అంచనాలు పెద్దగా లేవు కాబట్టి.. సుక్కూ అండ్ టీమ్ ఇబ్బంది పడలేదు. అందుకే హిందీలో పెద్దగా ప్రచారం చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. సినిమా పెద్ద హిట్ అవడమే కాదు.. రెండు భాగాలుగా వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాయి. ఇక త్వరలో 'పుష్ప 2' వంతు రాబోతోంది.

నిజానికి 'పుష్ప 2' చిత్రాన్ని ఈ ఏడాది మార్చి నెలలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లి.. డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాల దృష్ట్యా అంత ఆషామాషీగా సినిమా చేయడానికి వీలు కాదని అర్థం అయింది. అందుకే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ సమయం కేటాయించారు.

హడావిడిగా ప్రొడక్ట్ రెడీ చేయడం కంటే.. కాస్త టైం ఎక్కువ అయినా సరే అంచనాలు అందుకునే భారీ సినిమా అందించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్క్రిప్టు మీద ఎక్కువ రోజులు వర్క్ చేస్తున్నారు. అలానే రెండో భాగంలో బాలీవుడ్ జనాలకు పరిచయం ఉన్న కొన్ని ముఖాలను తీసుకురానున్నారు.

శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే నాయకుడిగా ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్'  లో చూపించారు. రెండో భాగం ది రూల్ లో అసలైన కథ ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. భారీ యాక్షన్ బ్లాక్స్ తో పాటుగా మదర్ సెటిమెంట్ కు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. మొదటి భాగంలో విలన్ గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ ఇందులోనూ కొనసాగనున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవి శంకర్ ఈ చిత్రాన్ని మొదటి భాగం కంటే అధిక బడ్జెట్ తో నిర్మించనున్నారు. వచ్చే ఏడాది రాబోయే 'పుష్ప 2' సినిమా అంచనాలు అందుకొని వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News