ఈ రోజుల్లో పెద్ద దర్శకులు స్టార్ హీరోలతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారంటే చాలు దాదాపు ఒక ఏడాదిన్నర ఏ పనులు పెట్టుకోకూడదు. కేవలం ఒకే కథపై దర్శకులు దృష్టి పెట్టాలి. ఇక సుకుమార్ లాంటి దర్శకుడు అయితే సినిమా అయిపోయేంత వరకు రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ రాదు. మంచి అవుట్ పుట్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటాడు. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమా ఎంత మంచి హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
మంచి కథనంతో వచ్చిన ఆ సినిమా కలెక్షన్స్ లో సెంచరీ చేసింది. పైగా నాట్ ఔట్. ఇకపోతే ఈ సినిమా కోసం సుకుమార్ దాదాపు ఏడాదిన్నర సమయాన్ని కేటాయించారు. దీంతో ఇప్పుడు తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఎక్కడికి వెళుతున్నారు అనేది చెప్పలేదు. ఇక ఇప్పుడు స్పెషల్ ప్లేసెస్ ని సెలెక్ట్ చెసుకున్నట్లు చెప్పాడు. అమెరికాలోని కొన్ని హాలిడేస్ స్పాట్ లలో సుకుమార్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయనున్నాడట.
దాదాపు రెండు నెలల వరకు స్వదేశానికి రాకుండా ప్లాన్ చేసుకున్నాడు. అలాగే మరో రెండు దేశాలకు కూడా వెళ్లేందుకు సుకుమార్ అనుకుంటున్నాడు. ఇక హాలిడేస్ తరువాత బన్నీ తో చేస్తాడా ప్రభాస్ తో చేస్తాడా అనేది అతను సెట్ చేసుకునే కథను బట్టి ఉంటుంది. ప్రస్తుతనికైతే సుక్కు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. సమ్మర్ తరువాత ఎవరితో వర్క్ చేస్తాను అనే విషయంపై పక్క క్లారిటీ ఇస్తానని చెప్పాడు. చూద్దాం ఎవరితో చేస్తాడో..