పుష్ప 2 తగ్గేదేలే.. సుక్కు ప్లాన్ అదుర్స్..!

Update: 2022-11-04 12:30 GMT
బాక్సాఫీస్ రికార్డుల్లో తగ్గేదేలే అంటూ రిలీజైన అన్ని చోట్ల వసూళ్ల బీభత్సం సృష్టించిన సినిమా పుష్ప ది రైజ్. తెలుగులో భారీ అంచనాలతో రిలీజైన ఇక్కడకు ఈక్వల్ గా హిందీలో ప్రభంజనం సృష్టించింది పుష్ప 1. పుష్ప రాజ్ మాస్ యాటిట్యూడ్ నార్త్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. అందుకే ఈ సినిమా అక్కడ 100 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. పుష్ప 1 కొట్టిన రికార్డుల వల్ల పుష్ప 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ అండ్ టీం బాగా కృషి చేస్తుంది. పుష్ప 2 సినిమా ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లినట్టు కెమెరా మెన్ షేర్ చేసిన ఫోటోతో తెలిసింది.

ఇక ఈ సినిమా విషయంలో మొదటి నుంచి సుకుమార్ సూపర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. పుష్ప 1 సినిమా ఇండియన్ ఆడియన్స్ ని మాత్రమే కాదు వరల్డ్ సినీ ప్రియులను అలరించింది. అందుకే వరల్డ్ వైడ్ గా కూడా పుష్ప 1 రికార్డులు సృష్టించింది. అందుకే వరల్డ్ సినీ లవర్స్ కి నచ్చేలా పుష్ప 2 తెరకెక్కిస్తున్నారట. అయితే సినిమాని మొదటి నుంచి ప్రమోట్ చేసేలా మొదలు పెట్టడమే ఆలస్యం ఓ స్పెషల్ టీజర్ గ్లింప్స్ రెడీ చేస్తున్నారట. పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ కోసం రామోజి ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ చేస్తున్నారట.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న అవతార్ 2 తో పాటుగా పుష్ప 2 గ్లింప్స్ వదలాలని చూస్తున్నారు. జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన మరో అద్భుత సృష్టి అవతార్ 2. ఆ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్నారు.

ఆ సినిమాతో పాటు పుష్ప 2 గ్లింప్స్ వదిలితే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇదో రకంగా సూపర్ ఐడియా అని చెప్పొచ్చు. అలా చేస్తే అవతార్ 2 ఆడే ప్రతి చోట పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ అవుతుంది.

పుష్ప 2 గ్లింప్స్ ని మొత్తం 25 భాషల్లో రెడీ చేస్తున్నారట. అవతార్ 2 తో పుష్ప 2 గ్లింప్స్ అంటే నిజంగానే సినిమాకి నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అని చెప్పొచ్చు. పుష్ప 2లో అసలు కథ ఉందని చెబుతున్న సుకుమార్ ఈ సెకండ్ పార్ట్ ఎలా తెరకెక్కిస్తాడా అని ఫ్యాన్స్ అంతా ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఈమధ్య పుష్ప 2 చిత్తూరు నుంచి బ్యాంకాక్ కి షిఫ్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఈసారి పుష్ప రాజ్ తనలో మరో వర్షన్ స్టైలిష్ వర్షన్ ని చూపిస్తాడని అంటున్నారు. అయితే వీటిలో ఏది నిజం అన్నది చిత్రయూనిట్ రివీల్ చేయాల్సిందే.

అవతార్ 2 ఇండియా వైడ్ గా భారీ సంఖ్యలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో అది ఆడే ప్రతి థియేటర్ లో పుష్ప 2 టీజర్ వస్తుంది. సో ఈ లెక్కన పుష్ప 2 కి ఉన్న అంచనాలకు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సుకుమార్ అండ్ టీం మొత్తం ఈ టీజర్ ని రెడీ చేసే పనిలో ఉన్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2లో ఫస్ట్ పార్ట్ లో ఉన్న పాత్రలతో పాటుగా మరికొన్ని పాత్రలు ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా భనవర్ సింగ్ షెఖావత్, పుష్ప రాజ్ ల మధ్య ఫైట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News