రంగస్థలం కాన్సెప్ట్ .. అంతకుమించి..

Update: 2018-02-16 06:10 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - రంగస్థలం సినిమా ఎన్ని బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాస్తుందో అనే విషయం కంటే ఇప్పుడు అందరి మదిలో మెదులుతోన్న ఒకే ఒక్క సందేహం సినిమా ఎలా ఉంటుంది. అసలు సినిమాలోని కాన్సెప్ట్ ఏంటి అనే విషయంపై ప్రస్తుతం చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటి నుంచి అయితే సినిమా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని సినిమాల్లోనే ఉన్నట్టుగా ఎమషనల్ ఫ్యామిలీ డ్రామా ఉంటుందని అనుకున్నారు.

సమంత పేదింటి పిల్లగా కనిపించడం - రామ్ చరణ్ సౌండ్ ఇంజనీర్ అంటూ సరదాగా ఉండటం వంటి సన్నివేశాలు సినిమాలో హైలెట్ కానున్నాయని టాక్ కూడా బాగానే వచ్చింది. అయితే వాటన్నటితో పాటు అసలు ఎజండా ఒకటి ఉందట. అదే రాజకీయం. దర్శకుడు సుకుమార్ కాలాన్ని వెనక్కి తీసుకెళుతూ తెరపై ఒక పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు అనుకుంటే.. కాదు అంతకుమించిన కాన్సెప్ట్  అన్నట్లు ఉంది.  సుకుమార్ ఎవ్వరు ఎప్పుడు చూపించని విధంగా ఉండే పాలిటిక్స్ ని సినిమాలో చూపించబోతున్నాడట.

1980 నాటి కాలానికి తగ్గటుగా ఉండే మండల్ ఎలక్షన్స్ ఉంటాయట. అందుకు సంబందించిన సన్నివేశాల్లో సుకుమార్ సృజనాత్మకత చాలానే ఉంటుందని తెలుస్తోంది. దానికి తోడు దేవి శ్రీ సంగీతం ఉత్కంఠను రేపెలా చేస్తుందట. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలు విజిల్స్ వేయించడం పక్కా అని సమాచారం. మరి జనాలకు ఈ సినిమా ఎంత కొత్తగా అనిపిస్తుందో చూడాలి.   


Tags:    

Similar News