దర్శకుడు సుకుమార్ తో సినిమా చేసిన ప్రతి హీరో ఆయన అభిమానిగా మారిపోతుంటాడు. ‘1 నేనొక్కడినే’ లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ మహేష్ కు ఆయన మీద అభిమానం తగ్గలేదు. ఆ సినిమా రిలీజ్ తర్వాత కూడా సుకుమార్ గురించి చాలా పాజిటివ్ గానే మాట్లాడాడు మహేష్. ఇక సుక్కుతో సినిమాలు చేసిన అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కూడా ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. మరి హీరోలకు సుకుమార్ మీద అంత అభిమానం ఎందుకు ఉంటోంది.. ఆయన వారికి ఏ మంత్రం వేస్తున్నాడు.. ఇదే విషయం ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు సుకుమార్.
‘‘హీరోలను బుట్టలో వేయడం లాంటిదేమీ ఉండదు. ఒక సినిమా కోసం నేను హీరోతో రెండేళ్లు ప్రయాణం చేస్తాను. వాళ్లతో కమ్యూనికేషన్ సరిగా లేకపోతే పని సజావుగా జరగదు. అందుకే ముందు వాళ్లను నేను బాగా ప్రేమిస్తాను. ఎంత అంటే.. 100 పర్సంట్ ఇష్టపడతాను. ఆ ప్రేమంతా నిజమైనదే. కేవలం సినిమా కోసం నటన కాదు. నేను హీరోను ఇష్టపడితేనే సినిమా చేస్తా కదా. వాళ్లతో నేను ప్రేమతో ఉంటాను కాబట్టి వాళ్లకూ నా మీద అభిమానం ఏర్పడుతుంది. సినిమా చేస్తున్నన్ని రోజులూ బాగుంటాం. కాబట్టి ఆ తర్వాత కూడా ఆ అఫెక్షన్ కొనసాగుతుంది. నేను ఇప్పటిదాకా పని చేసిన ప్రతి హీరో మంచి వాడే. వాళ్లతో నా సంబంధాలు చాలా బాగున్నాయి’’ అని సుకుమార్ తెలిపాడు.