మ్యూజికల్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్.. తను ఇచ్చే ప్రతీ సినిమాలోని ప్రతీ పాటను డిఫరెంట్ గా ఉండేలా కేర్ తీసుకుంటాడు. ఆడియో ఫంక్షన్స్ - అవార్డ్ పంక్షన్స్ లో స్టేజ్ పై దేవిశ్రీ యాక్టివ్ నెస్ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. డీఎస్పీ ఓ సినిమాలో హీరోగా చేస్తే ఎలా ఉంటుందనే చాలా రోజులుగా ఉంది. కుమారి 21ఎఫ్ టైంలో దీనిపై ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేశాడు సుకుమార్. రాక్ స్టార్ హీరోగా తను సినిమా చేస్తానని చెప్పాడు సుకుమార్.
ఇప్పుడీ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా పడలేదు. డీఎస్పీ ని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన తర్వాత.. తన తండ్రి సత్యమూర్తి మరణించారు. దీంతో కొన్నాళ్ల పాటు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచించే పరిస్థితి చేయలేకపోయాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో రిలీజ్ అయింది. ఆ వెంటనే రామ్ చరణ్ తో మూవీ పనుల్లో పడిపోయాడు సుకుమార్. చెర్రీ ఇప్పటివరకూ చేయని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో చూపించాలన్నది సుక్కు ఐడియాగా తెలుస్తోంది.
ప్రస్తుతం చేస్తున్న తని ఒరువన్ రీమేక్ ధృవ తర్వాత.. సుకుమార్ తో 'ఫార్ములా ఎక్స్' ప్రారంభిస్తాడు. అంటే ఈ రెండు సినిమాలు పూర్తయ్యేవరకూ.. సుకుమార్ ఫుల్లు బిజీగానే ఉంటాడు. అప్పటివరకూ దేవిశ్రీ తెరంగేట్రం సంగతి వాయిదా పడిపోయినట్లే.