‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో నిర్మాత అవతారమూ ఎత్తాడు సుకుమార్. ఆ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే కూడా అతడిదే. ఆ చిత్రానికి దర్శకుడు సూర్య ప్రతాప్ అయినా.. ప్రతి సన్నివేశంలోనూ సుకుమార్ కనిపించాడు జనాలకు. అంతలా తనదైన ముద్ర వేశాడు సుక్కు. దర్శకుడిగా ‘నాన్నకు ప్రేమతో’తో మంచి విజయాన్నందుకున్న సుక్కు.. ఆ ఊపులో తన నిర్మాణంలో రెండో సినిమాను మొదలుపెట్టేయబోతున్నాడు. ఆ సినిమా పేరు.. దర్శకుడు. ఈ టైటిల్ చూడగానే సుకుమార్ మరోసారి తన నిజ జీవితంలోని అనుభవాల్ని రంగరించి కథ రెడీ చేసేస్తున్నాడని.. ఇది అతడి కథే అని ఫిక్సయిపోయారు. ఐతే ఈ సినిమాకు తాను కేవలం నిర్మాతను మాత్రమే అని.. రచనలో ఏమాత్రం జోక్యం చేసుకోవట్లేదని చెప్పాడు సుక్కు.
‘‘దర్శకుడు సినిమాకు నేను కేవలం నిర్మాతను మాత్రమే. దీనికి కథ - స్క్రీన్ ప్లే నేను రాయట్లేదు. ఓ దర్శకుడు ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న దానిపై ఈ చిత్రం నడుస్తుంది. నేను కేవలం నిర్మాతగానే ఉంటున్నందుకు హ్యాపీ’’ అని సుక్కు వెల్లడించాడు. ఐతే సుకుమార్ దర్శకుడిగా మారాక ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఇది సుక్కు కథేనేమో అని డౌట్ మాత్రం వస్తోంది. అతను కథ రాయకున్నా.. అతడి కథనే శిష్యుడు తీయబోతున్నాడేమో. ఈ చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంటుగా పని చేసిన హరి ప్రసాద్ తీయబోతున్న సంగతి తెలిసిందే. సుకుమార్ రచనలో జోక్యం చేసుకోవట్లేదు కాబట్టి.. ‘సుకుమార్ రైటింగ్స్’ అనే బేనర్ పేరు కూడా మార్చేస్తాడేమో చూద్దాం.