సుకుమార్ రైటింగ్స్ లో సుకుమార్ నిర్మించిన కుమారి 21 ఎఫ్ బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తూ హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఈలోగానే ఈ సినిమాపై విమర్శకులు తమదైన శైలిలో బాణాలు ఎక్కుపెట్టారు. ఇది కూడా కాపీ సినిమానే, ఫ్రెంచి సినిమా నుంచి ఎత్తేసిందే అంటూ న్యూస్ వచ్చేసింది..
అయితే క్వయిట్ ఆపోజిట్ గా సుక్కూ మాత్రం ఓ సొంత కథ ఒకటి చెప్పాడు. ఇది నా కాలేజీ రోజుల్లో జరిగిన కొన్నిరియలిస్టిక్ ఇన్సిడెంట్స్ నుంచే తీసుకున్న కథ. నేను కాలేజీ రోజుల్లో బాగా సిగ్గరిని. ఏ అమ్మాయితోనూ మాట్లాడేవాడిని కాను. ఎవరైనా అమ్మాయి తనంతట తానుగా వచ్చి మాట్లాడాల్సిందే. నేను మాత్రం దూరం నుంచే మూగ వాడిలా సైగలు చేసేవాడినంతే... అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు రియాలిటీలోని మరో ట్విస్టు రివీల్ చేస్తూ.. అసలు కుమారి లాంటి ఓ అమ్మాయి మా కాలేజ్ లో ఉండేది. తను చాలా బోల్డ్. ఓసారి కొందరు కుర్రాళ్లతో బెట్ కట్టింది. తను ఓ ఆరుగురితో కలిసి పిక్నిక్ కి ఒంటరిగా వస్తానని చెప్పింది. చెప్పిందే చేసి చూపించింది. అయితే అట్నుంచి తిరిగొచ్చాక మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయే ట్విస్టొకటి ఆ కుర్రాళ్లు చెప్పారు. ఈవిడగారికి బాగా లూజ్ అనేదే వాళ్లంతా ముక్తకంఠంతో చెప్పిన మాట. ఆ సంఘటన ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ విషయాలన్నిటినీ కుమారి క్యారెక్టర్ లోకి పంప్ చేశాను అంటూ సుక్కూ చాలా తెలివిగానే కవర్ చేసేశాడు.
సుక్కూ చెప్పేది నమ్మబుల్ గానే ఉంది కానీ మరి ఆ ఫ్రెంచి సినిమా మాటేమిటి? ఆ రెండు సినిమాల నుంచి కాపీ కొట్టేసిన సీన్ల మాటేమిటి? ప‌్చ్ ఆయనే చెప్పాలి మరి!