క్రేజ్ ఉన్న హీరోయిన్స్ ని సినిమాల్లోకి తీసుకోవడం వేరు. కానీ ఫేడవుట్ అయిపోయి.. సినిమాలకు దూరమైన అలనాటి హీరోయిన్స్ కు ఇప్పటి సినిమాల్లో కేరక్టర్స్ సృష్టించడం వేరు. ఇప్పుడు కొందరు దర్శకులు.. అత్త - అమ్మ పాత్రల కోసం ఒకనాటి హీరోయిన్స్ ను తీసుకొస్తున్నారు. వారిని అందంగా చూపిస్తూనే.. మరోవైపు సినిమాపై ప్రత్యేక ఆసక్తి కలిగిస్తున్నారు.
మిర్చి మూవీతో కొరటాల శివ నదియాను హీరో అమ్మ పాత్రలో తీసుకున్నాడు. ఆ తర్వాత శ్రీమంతుడు కోసం సుకన్యను తీసుకున్నాడు కొరటాల. ఈ రెండు పాత్రలు విపరీతంగా క్లిక్ అయ్యాయి. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అత్తారింటికి దారేది.. అ..ఆ. చిత్రాలలో నదియాతో సూపర్బ్ కేరక్టర్లు చేయించాడు. తన మరుసటి సినిమాల్లో కూడా ఈ టైపు కేరక్టర్లు ఉంటాయని టాక్. ఇప్పుడు దర్శకుడు పరశురాం కూడా ఇదే రూట్ లో ఉన్నాడు.
సారొచ్చారు చిత్రంలో జయసుధతో మంచి కేరక్టర్ చేయించిన పరశురాం.. రీసెంట్ మూవీ శ్రీరస్తు శుభమస్తులో మాజీ హీరోయిన్ సుమలతను హీరోకి అమ్మని చేశాడు. పదేళ్ల తర్వాత సుమలత చేసిన మూవీ ఇది. ఎంతో అందంగా కనిపించడమే కాదు.. అంతకు మించి పెర్ఫామెన్స్ తో ఇరగదీసింది. కీలకమైన సన్నివేశాల్లో కామెడీ.. ఎమోషన్స్ పండించేసి తన ట్యాలెంట్ ని మరోసారి చూపింది సుమలత. మాజీ హీరోయిన్స్ ను అమ్మ పాత్రల్లో అయినా సరే.. మళ్లీ చూసే అవకాశం రావడం చాలామందికి సంతోషాన్నే ఇస్తోంది.