అక్కినేని హీరోలు ఎక్సయిట్‌ అయ్యారు

Update: 2015-09-20 15:28 GMT
ఒక్కొక్కరూ అసలు అఖిల్‌ తో ఉన్న అనుబంధం గురించి చెబుతుంటే అసలు గచ్చిబౌళి స్టేడియం దద్దరిల్లిపోయిందంతే. అఖిల్‌ తొలి సినిమా ''అఖిల్'' ఆడియో లాంచ్‌ లో వక్తలందరూ అదరగొట్టేశారు. ముఖ్యంగా అక్కినేని హీరోలు. అలాంటి కొన్ని టిట్‌ బిట్స్‌ చూస్తే..

''ఏఎన్నార్‌ కు మహేష్‌ అంటే ఇష్టం, నాకేమో కృష్ణగారంటే ఇష్టం. అయితే నా స్నేహితుడు మహేష్‌ ఇప్పుడు అఖిల్‌ ను లాంచ్‌ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది'' అంటున్నాడు సీనియర్‌ అక్కినేని హీరో సుమంత్‌. బడ్డోడికి కంగ్రాట్స్‌ అంటూ చెప్పాడు ''మహేష్‌ కు అఖిల్ కు చాలా సంబంధాలున్నాయ్‌. మహేష్‌ లా అఖిల్‌ కు కూడా సూపర్‌ స్టార్‌ ఫాథర్‌ ఉన్నాడు.. అలాగే సినిమాల్లోకి రాకముందే సూపర్‌ స్టార్‌ అయిపోయాడు. సో, మహేష్‌ అంతా అవ్వాలని కోరుకుంటున్నా..'' అని చెప్పుకొచ్చాడు సుమంత్‌.

ఇకపోతే చిన్ననాటి నుండి అఖిల్‌ ఎందుకో బాగా స్పెషల్‌ అని.. అసలు చిన్నప్పుడే సినిమా చేసి, ఇప్పుడు యాడ్లు చేసేసి, సినిమాల్లోకి రాకముందే పెద్ద స్టార్‌ అయిపోయి ఇప్పుడు ఇలా లాంచ్‌ అవ్వడం టాలీవుడ్‌ చరిత్రలోనే తొలిసారి అంటూ పొడిగేశాడు సుశాంత్‌.
Tags:    

Similar News