తన మావయ్య నాగార్జున డైలాగే తనను కాపాడిందంటున్నాడు సుమంత్. ఈ మధ్య ఓ రెస్టారెంటుకు వెళ్లినపుడు సుమంత్ ఓ అమ్మాయిని చూసి నవ్వాడట. ఐతే ఆ అమ్మాయి సుమంత్ హీరో అని గుర్తుపట్టిందో లేదో కానీ.. నేరుగా అతడి దగ్గరికి వచ్చి నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అడిగిందట. ఐతే అప్పుడు ఏం చెప్పాలో తెలియక సడెన్ గా ‘ఊపిరి’ టీజర్ లోని డైలాగ్ గుర్తు తెచ్చుకుని ‘‘అందాన్ని ఆస్వాదించాలి’’ అని చెప్పాడట. అలా తాను బతికిపోయానని.. ‘ఊపిరి’ రిలీజ్ తర్వాత అబ్బాయిలందరూ కూడా ఈ డైలాగే చెప్పి తప్పించుకుంటారని చమత్కరించాడు సుమంత్. ‘ఊపిరి’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ సుమంత్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
ఈ వేడుకలో పాల్గొన్న ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నాగార్జున గారు ఎప్పుడూ సాహసాలు చేయడానికి వెనకాడరు. కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్ పేషెంట్ గా నటించడమంటే మామూలు విషయం కాదు. కొత్తగా ఆలోచించారు అందుకే గీతాంజలి సినిమా వచ్చింది. అలాగే నిన్నేపెళ్లాడతా లాంటి సినిమా తర్వాత అన్నమయ్య చేయడం ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక స్టార్ హీరో యాక్సిడెంట్ లో చనిపోతాడు అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ నాగ్ సార్ ఒప్పుకున్నారు కాబట్టే ‘సోగ్గాడే చిన్నినాయనా’ వచ్చింది. ఇప్పుడు వీల్ ఛైర్ లో ఉండే క్యారెక్టర్ చేయడం అంటే ఓ సాహసం. ఊపిరి గొప్ప సినిమా అవుతుంది. ఇద్దరు స్టార్ హీరోలతో వంశీ పైడిపల్లి యాక్షన్ ఫిలిం చేస్తాడనుకున్నాను. కానీ సినిమా ఇంత వైవిధ్యంగా ఉంటుందనుకోలేదు’’ అన్నాడు.