స‌మ్మ‌ర్ రిలీజ్ ల‌పై స‌మ్మెట పోటు

Update: 2019-02-16 01:30 GMT
స‌మ్మ‌ర్ లో డ‌జ‌ను పైగా సినిమాలు రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి. మార్చి మొద‌లు, ఏప్రిల్ లో ఇవ‌న్నీ రిలీజైపోతున్నాయి. ఇందులో మ‌హేష్‌ - నాగ‌చైత‌న్య‌ - స‌మంత‌ - నాని - సూర్య‌ - లారెన్స్ వంటి స్టార్లు న‌టిస్తున్న సినిమాలు ఉన్నాయి. ఈ సీజ‌న్ లో భారీ క్రేజుతో మ‌హేష్ న‌టిస్తున్న `మ‌హ‌ర్షి` రిలీజ్ కి రెడీ అవుతుంటే ఇత‌ర హీరోలు త‌మ ల‌క్ ని చెక్ చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమాల‌కు ఊహించ‌ని ఉత్పాతంలా కొన్ని ఇబ్బందులు త‌ప్పేట్టు లేవు. జ‌నాల్ని స‌వ్యంగా థియేట‌ర్ల‌కు రానివ్వ‌కుండా అడ్డుప‌డే కొన్ని ఊహించ‌ని స‌న్నివేశాలు క‌నిపిస్తున్నాయి.

ఓవైపు ఏపీ ఎన్నిక‌లు.. మ‌రోవైపు ఎండల‌ మంట‌ ప్ర‌భావం.. ఇంకోవైపు ఎగ్జామ్స్ .. ఇవ‌న్నీ టాలీవుడ్ కి స‌మ్మెట పోటులా ప‌రిణ‌మించ‌నున్నాయా? అన్న సందేహాలు నెల‌కొన్నాయి. వీటితో పాటు కొన్ని ఊహాతీత‌మైన‌ ప‌రిణామాలు జ‌నాల్ని థియేట్ల‌కు వెళ్ల‌కుండా ఆపితే ఏంటి స‌న్నివేశం?  ఇంకా ఫిబ్ర‌వ‌రి ముగింపు న‌కు రాక‌ముందే ఎండ‌లు ముదిరిపోతున్న స‌న్నివేశం క‌నిపిస్తోంది. ఉక్క‌పోత మొద‌ల‌య్యేట్టే ఉంది. దీనికి తోడు ఎన్నిక‌లు అన‌గానే ఒక‌టే డిస్ట్ర‌బెన్స్‌. ఊరూ వాడా ప‌ల్లె ప‌ట్నం అన్నిచోట్లా ప్ర‌చారం దంచుడుతో హోరెత్తుతుంది. మ‌రోవైపు పొలిటిక‌ల్ గా గొడ‌వ‌లు త‌ప్ప‌నిస‌రి. కార‌ణం ఏదైనా ఇదంతా స‌గ‌టు ప్రేక్ష‌కుడిని థియేట‌ర్ వైపు మ‌ర‌ల‌కుండా చేసేట్టే క‌నిపిస్తోంది. దీంతో పాటు వ‌రుస‌గా టెంత్ - ఇంట‌ర్ - డిగ్రీ - పీజీ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల సీజ‌న్ కావ‌డంతో అస‌లు విద్యార్థులు ఎవ‌రైనా థియేట‌ర్ల వైపు వ‌చ్చే స‌న్నివేశం ఉంటుందా? అన్న సందేహాలు నెల‌కొన్నాయి. కొంద‌రికి థియ‌రీ ప‌రీక్ష‌లు పూర్త‌యితే - మ‌రికొంద‌రికి ప్రాక్టిక‌ల్స్ ఎగ్జామ్స్ ఎటెండ్ కావాల్సి ఉంటుంది. ఇలా ప్రిప‌రేష‌న్స్ బిజీలో సినిమాల‌కు ఎన్నో అడ్డంకులు త‌ప్ప‌నిస‌రి.

మ‌రోవైపు స‌మ్మ‌ర్ సినిమాలు ప్ర‌చారార్భాటానికి రెడీ అవుతున్నాయి. నెల‌రోజుల ముందు నుంచే ప్ర‌చారం కోసం ప్రిపేర‌వుతున్న వారు కొంద‌రైతే - అస‌లు ఎలాంటి అల‌జ‌డి లేకుండా రిలీజ్ ముందు హంగామా చేసేవాళ్లు మ‌రికొంద‌రు. ఈ సీజ‌న్ లో `మ‌హ‌ర్షి` మిన‌హా ఇత‌ర సినిమాల‌పై జ‌నాల్లో చెప్పుకోద‌గ్గ హైప్ అయితే లేదు. మ‌జిలీ - జెర్సీ - ఎన్‌ జీకే - సూర్య‌కాంతం - కాంచ‌న 3 వంటి చిత్రాల‌కు ఈ ప్ర‌చారం స‌రిపోదు. ఇంకా ఉధృత‌మైన మీడియా ప్ర‌మోష‌న్ అవ‌స‌రం అని విశ్లేషిస్తున్నారు. జ‌నం దృష్టి త‌మ‌పైకి మ‌ర‌లాలంటే ఆర్జీవీ ఫార్ములాతో ఏదైనా కొత్త‌గా చేయాల్సి ఉంటుందేమో?!
Tags:    

Similar News