స్టార్‌ హీరో చెల్లి ప్రేమ వ్యవహారం మరింత సీరియస్‌

Update: 2019-06-25 11:17 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ చెల్లి ప్రేమ వ్యవహారం మరింత సీరియస్‌ అయ్యింది. ఇటీవలే ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒక ముస్లీం జర్నలిస్ట్‌ ను ప్రేమించానని.. కాని నా కుటుంబ సభ్యులకు మాత్రం నా ప్రేమ ఇష్టం లేదు. అందుకే గత కొన్ని రోజులుగా నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా నిర్ధందించారంటూ ఆరోపించింది. తాను విడిగా ఉండాలనుకున్నా ఒప్పుకోవడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను లవ్‌ చేసిన వ్యక్తిని టెర్రరిస్ట్‌ అంటూ ముద్ర వేశారంటూ కూడా హృతిక్‌ రోషన్‌ చెల్లి సునైనా రోషన్‌ ఆరోపించింది.

సునైనా రోషన్‌ ను ప్రేమించిన రుహైల్‌ తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. హృతిక్‌ రోషన్‌ పై మరియు రోషన్‌ కుటుంబ సభ్యులపై రుహైల్‌ సంచలన ఆరోపణలు చేశాడు. గతంలో హృతిక్‌ రోషన్‌ ముస్లీం మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ముస్లీంలతో లేని సమస్య ఇప్పుడు నేను సునైనా ప్రేమించుకుంటే వచ్చిన సమస్య ఏంటీ అంటూ రుహైల్‌ ప్రశ్నించాడు. అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా  అన్నాడు.

సునైనా రోషన్‌ కోరుకున్న జీవితంను ఇవ్వడం కుటుంబ సభ్యుల బాధ్యత. ఆమె కోరుకున్నట్లుగా అవకాశాలు కల్పించాలి. నేను ఆమె కలిసి జీవితాన్ని పంచుకోవలనుకుంటున్నాం. మేమిద్దం కలిసి జీవించాలనుకోవడంలో తప్పేముందో రోషన్‌ ఫ్యామిలీ చెప్పాలి. ఒక మతం లేదా ప్రాంతం ఆధారంగా మనుషుల గురించి నిర్ధారించడం అవివేకం అవుతుందని.. నేను ముస్లీం అయినంత మాత్రాన టెర్రరిస్ట్‌ అనడం దారుణం అంటూ రుహైల్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికైన మించి పోయినది లేదు.. సునైనా కుటుంబ సభ్యులు మా ప్రేమను అంగీకరిస్తే చాలా సంతోషిస్తానంటూ రుహైల్‌ చెప్పుకొచ్చాడు. సునైనా రోహైల్‌ ల ప్రేమ వ్యవహారం రోషన్‌ కుటుంబ సభ్యులకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికే సునైనా ఇప్పుడు రుహైల్‌ మీడియా ముందుకు వచ్చి రోషన్‌ ఫ్యామిలీపై ఆరోపణలు చేయడంతో వ్యవహౄరం సీరియస్‌ అయ్యింది. ఈ ప్రేమ వ్యవహారం ఇంకెత దూరం సాగుతుందో చూడాలి. 
Tags:    

Similar News