తండ్రికి కట్టింగ్‌ చేసిన యంగ్‌ హీరో

Update: 2020-05-17 03:55 GMT
గత రెండు నెలలుగా షూటింగ్స్‌ అన్ని బంద్‌ ఉండటంతో సినీ కార్మికుల నుండి స్టార్స్‌ వరకు అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. కరోనా విపత్తు సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ సమయంలోనే హీరోలు తమలో దాగి ఉన్న కళలను వెలికి తీస్తున్నారు. కొందరు హీరోలు వంట చేస్తుంటే మరికొందరు హీరోలు ఇంటి పని చేస్తూ టైం పాస్‌ చేస్తున్నారు. ఈ సమయంలోనే సందీప్‌ కిషన్‌ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

తన తండ్రికి సోదరితో కలిసి హెయిర్‌ కట్‌ చేశాడు. స్టైలిష్‌ లుక్‌ లోకి తండ్రిని మార్చి అది వీడియో తీసి ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశాడు. ఈ లాక్‌ డౌన్‌ టైం ను కుటుంబ సభ్యులతో కలిసి చాలా సరదాగా సందీప్‌ కిషన్‌ గడుపుతున్నాడు. గత రెండు నెలలుగా పూర్తిగా ఇంటికే పరిమితం అయిన సందీప్‌ కిషన్‌ లాక్‌ డౌన్‌ సడలించి షూటింగ్స్‌ కు అనుమతిస్తే తన ఎ1 ఎక్స్‌ ప్రెస్‌ చిత్రాన్ని పూర్తి చేయాలని ఎదురు చూస్తున్నాడు.

కరోనా కారణంగా సందీప్‌ కిషన్‌ సినిమా షూటింగ్‌ ఆగిపోవడంతో పాటు ఆయన సెలూన్‌ మరియు హోటల్‌ బిజినెస్‌ లు కూడా ఆగిపోయాయి. ఈ సమయంలో సందీప్‌ కిషన్‌ కు భారీ నష్టం వస్తుందట.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News