యంగ్ హీరో సందీప్ నటించిన `నిను వీడని నీడను నేను` ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ ని సదరు హీరో అలుపన్నదే లేకుండా చేస్తున్నాడు. వీలున్న ప్రతి వేదికకు వెళ్లి అందరికీ తెలిసేలా చేసేందుకు సందీప్ చాలానే ప్రయాస పడుతున్నాడు. రెండోవారంలోనూ ప్రచారం పరంగా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సక్సెస్ మీట్ లో సందీప్ చెప్పిన ఓ సంగతి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరో ఒకావిడ కొడుకు ప్రేమ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ సినిమా నా కొడుకు చూసి ఉంటే అసలు ఆత్మహత్య చేసుకునేవాడు కానే కాదు అంటూ ఆవిడ ఏడ్చేసిందట.
సందీప్ చెప్పింది నిజమో అబద్ధమో ఏమో కానీ.. ఇది వినేందుకు మాత్రం బావుందని మీడియా జనం అనుకున్నారు. విశాఖ పట్నం కి చెందిన ఒక పెద్దావిడ సందీప్ కి ఫోన్ చేసి.. ``మా అబ్బాయి మూడు నెలల కిందట లవ్ ఫెయిల్యూర్ అని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా మూడు నెలల కిందట వచ్చి ఉంటే.. మా అబ్బాయి సినిమా చూసి ఉంటే.. ప్రాణాలు తీసుకునే ముందు మా గురించి ఆలోచించే ఉండేవాడేమో`` అని అన్నారట. ఆ మాట విన్న తనకు కళ్ల వెంట నీళ్లు తిరిగాయని సందీప్ చెప్పాడు. నిను వీడని నీడను నేనే విజయానికి ఇంతకంటే ఏం కావాలి. డబ్బు రావాలా? అని సందీప్ అన్నాడు.
బాగానే ఉంది.. దీంతో పాటే మరో సంగతిని ఈ కుర్రహీరో ఎంతో ఎమోషన్ అయ్యి మరీ చెప్పాడు. రిలీజ్ ముందు రోజు రాత్రి తిరుమల వెళ్లాను. శుక్రవారం ఉదయం నా దర్శనం. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఒంటిగంటన్నరకు ఫోన్ ఆన్ చేస్తే రిజల్ట్ తెలుస్తుందని అనుకున్నా. సాధారణంగా 3పీఎం 4పీఎం కి కానీ రిజల్ట్ తెలుస్తుంది. ఆడుతుందా? లేదా? అనేది తేల్తుంది. నాకు ఆరోజు ఆ టైమ్ కి ఫోన్ లు వచ్చాయి. బావుందన్న రిపోర్ట్ అందింది. కానీ కన్విన్స్ కాలేదు. ఆరు గంటలకు చెప్పాకే కన్ఫామ్ అయ్యాను! అంటూ సందీప్ ఎమోషన్ అయ్యాడు. నా సినిమాలు ఆడినా ఆడకపోయినా నిజాయితీగా అంగీకరించడం నా అలవాటు అని సందీప్ డబ్బా కొట్టేశాడు. ఇప్పటివరకూ సందీప్ హీరోగా నటించినవి ఆడలేదు. తొలిసారి నటిస్తూ సినిమాని నిర్మించాడు కాబట్టే అతడు ఇంతగా ఎమోషన్ అవుతున్నాడు. ఈ రేంజులో ప్రమోషన్ కూడా చేస్తున్నాడు మరి!!