కథానాయకుడిగా ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టేశాడు అల్లరి నరేష్. సునీల్ హాస్యనటుడిగా ఎక్కువ సినిమాలు చేశాడు కానీ.. కథానాయకుడిగా తక్కువే. అయితే తొలి చిత్రం `అందాలరాముడు`తోనే మంచి మార్కెట్ ని సంపాదించుకొన్నాడు. ఆ మార్కెట్టుకి తగ్గట్టుగానే ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాకీ పారితోషికం పెంచుకొంటూ వెళ్లాడు. ఆయన ఒకట్రెండు సినిమాలకి రూ: 4 కోట్లు పారితోషికం కూడా తీసుకొన్నట్టు ప్రచారం సాగింది. అల్లరి నరేష్ కూడా దాదాపుగా అంతే పారితోషికం తీసుకొన్నాడు. అయితే ఇటీవల సునీల్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో తొలినాళ్లలో వైభవం క్రమంగా మసకబారుతూ వచ్చింది. అల్లరి నరేష్ కి కూడా ఫ్లాపుల బాధ తప్పలేదు. దాంతో ఆయన జోరు కూడా బాగా తగ్గింది.
సునీల్ ప్రస్తుతం బ్యాక్ టు పెవిలియన్ అంటూ మళ్లీ హాస్యప్రధానమైన పాత్రలపై దృష్టిపెడుతున్నాడు. మధ్యమధ్యలో తన శైలికి తగ్గ కథల్ని ఎంపిక చేసుకొని కథానాయకుడిగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే అల్లరి నరేష్ - సునీల్ `సిల్లీ ఫెలోస్` అనే సినిమా చేశారు. ఆ చిత్రం కోసం ఇద్దరూ సమానంగా పారితోషికం తీసుకొన్నారట. నిజానికి సినిమాలో నరేషే హీరోనట. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడట. కానీ సునీల్ కీ - నరేష్ కీ సమానంగా నిర్మాతలు 1.25 చొప్పున పారితోషికం ఇచ్చారట. కానీ పారితోషికాల గురించి పట్టించుకోకుండా ఇద్దరూ కలిసిమెలిసి సినిమా చిత్రీకరణలో పాల్గొన్నట్టు చిత్రవర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఇద్దరికీ ఇప్పుడు అర్జంటుగా హిట్టు కావాలి. మరి సిల్లీఫెలోస్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రాన్ని భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.