ఒకప్పుడు బండగా, ఆ ఆకారాన్ని చూస్తేనే నవ్వొచ్చేలా ఉండేవాడు సునీల్. అందుకే దర్శకులకి కూడా ఆయన్ని దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్లు సృష్టించడం సులువైపోయేది. కానీ మనోడు హీరో అయ్యాక స్టైల్ మార్చేశాడు. ఏకంగా సిక్స్‌ప్యాక్ బాడీని తయారు చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చేశాడు. అయితే ఆ ప్రభావం మాత్రం తర్వాత్తర్వాత సునీల్‌పై బలంగా పడిపోయింది. నల్లగా ఉన్నా రౌండ్ ఫేస్‌తో చూడగానే ఆకట్టుకొనేలా కనిపించే సునీల్.. సిక్స్‌ప్యాక్ పుణ్యమాని పీలగా తయారైపోయాడు. ఫేస్‌లోనూ మునుపటి కళ తగ్గిపోయింది. తర్వాత్తర్వాతైనా మళ్లీ మామూలుగా తయారవుతాడేమో అనుకొంటే ఆలా జరగలేదు. 'భీమవరం బుల్లోడు'లోనూ అదే తరహాలో కనిపించాడు. ఇక సునీల్ మారడేమో అనుకొన్నారంతా. మునుపటి సునీల్‌ని మళ్లీ చూడలేమేమో అని డిసైడ్ అయిపోయారు.
కానీ సునీల్ పాత స్టైల్లోకి మారిపోయాడు. ఇదివరకటిలా కాస్త ఒళ్లు చేసి కనిపిస్తున్నాడు. ఫేస్‌లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 'కేరింత' ఆడియో వేడుకకి హాజరైన సునీల్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. చాలా రోజుల తర్వాత సునీల్ ఇలా ఓ వేడుకకి హాజరయ్యాడు. అక్కడ అతిథులు, సినిమా వర్గాలు, మీడియా సునీల్‌ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ లుక్ బాగుంది, కంటిన్యూ చేయండని ఆయనకి సలహా ఇస్తూ కనిపించారు. సునీల్ ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్లో వాసు వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. త్వరలోనే ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.