హీరోగా ఏమైనా చేస్తా కానీ.. రొమాన్స్ మాత్రం తన వల్ల కాదంటున్నాడు సునీల్. తాను హీరోగా మారాక డ్యాన్సులు - ఫైట్లు సహా ఎందులోనూ ఇబ్బంది పడలేదని.. ఒక్క రొమాన్స్ విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందని సునీల్ తెలిపాడు. ‘మర్యాదరామన్న’ సినిమా సమయంలో సలోనికి ముద్దు పెట్టడానికి తాను పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదని సునీల్ చెప్పాడు.
‘‘హీరో అంటే కామెడీ - ఫైట్లు - డ్యాన్స్ - సెంటిమెంట్ - రొమాన్స్ అన్నీ చేయాలి. కానీ నాకు రొమాన్స్ చేయడం చాలా కష్టం. ‘మర్యాద రామన్న’ చేస్తున్నప్పుడు సలోనికి ముద్దు పెట్టే సీన్ కి ఎన్ని టేక్స్ తీసుకున్నానో లెక్కలేదు. ఆ సీన్ చేసి చూపించిన అసిస్టెంట్ డెరైక్టర్ ప్రతిసారీ ముద్దు పెట్టేవాడు. ‘ఇన్నిసార్లు నేను ముద్దు పెట్టే బదులు మీరు ఒక్కసారి సరిగ్గా పెట్టేస్తే షాట్ ఓకే అయిపోతుంది కదా’ అనేవాడు. ఆ ఒక్క సీన్ అనే కాదు.. రొమాంటిక్ సీన్స్ చేయడానికి ప్రతిసారీ ఇబ్బందే. నేను చేసిన ఆ తరహా సన్నివేశాలు చూస్తే.. నా ఇబ్బందిని ఈజీగా గుర్తించవచ్చు. నేను బాలీవుడ్ లో గోవిందా టైపు. అతను కూడా రొమాన్స్ విషయంలోనే ఇబ్బంది పడేవాడు’’ అని సునీల్ చెప్పాడు.
తాను ఇంతకుముందు దిల్ రాజు బేనర్ లో కమెడియన్ గా నటించి.. ఇప్పుడ అదే బేనర్లో హీరోగా ‘కృష్ణాష్టమి’ చేశానని.. ఐతే రెండు సందర్భాల్లోనూ దిల్ రాజు తనను ఒకేలా ట్రీట్ చేశాడని సునీల్ చెప్పాడు. ‘‘దిల్ రాజు గారు నాకు స్ఫూర్తి. నేను పంజాగుట్టలో రూంలో ఉన్నప్పుడు రాజుగారు డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. అప్పట్లో చాలా లావుగా ఉండేవారు. అలాంటి ఆయన చాలా పట్టుదలగా కష్టపడి ఇప్పుడున్నట్లుగా తయారయ్యారు. నేను సన్నబడ్డానికి ఆయనే స్ఫూర్తి. ఆయనతో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. నేను కమెడియన్ గా చేసినప్పుడు కూడా నన్ను హీరోలానే ట్రీట్ చేసేవారు. ఇప్పుడూ అలాగే చూస్తున్నారు. ఏ మార్పూ లేదు’’ అని సునీల్ తెలిపాడు.