పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా మారిపోయింది. సన్నీ సినిమాలకు వరల్డ్ వైడ్ గా మార్కెట్ ఉండటంతో అక్కడి నిర్మాతలు ఆమెతో సినిమాలు చేయాలని తెగ ఉత్సాహపడుతున్నారు. సన్ని ఏదైన సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన కూడా యువత థియేటర్లవైపు పరుగులు పెడుతోంది కాబట్టి దానిని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే ఆమె ఎంతగా పాపులర్ అయిందో అంతకు మించి విమర్శలు కూడా ఆరేంజ్ లోనే వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా సీపిఐ నేత అతుల్ అంజన్ కూడా ఆమెపై విమర్శలకు దిగారు. ఇండియాలో సన్నీ లియోన్ వల్లే సగం రేపులు జరుగుతున్నాయి. ఇటీవల ఆమె నటించిన ఒక యాడ్ ఫిలిం చూశాను. అదృష్టవశాత్తు ఆ యాడ్ టీవీల్లో ఇంకా ప్రసారం కాలేదు. బుల్లి తెరపై గనుక ప్రసారమైతే వయసు బేధం లేకుండా అందరూ నాశనం అయిపోవడం ఖాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అంజన్ ఇలా ఆమెను వేలెత్తి చూపడం ఎంత వరకూ సమజసమో తెలీదు కానీ.. సన్నీలియోన్ వల్లే రేప్‌లు జరుగుతున్నాయ్ అన్న అర్థం ధ్వనించింది.
అన్ లిమిటెడ్ సెక్స్ సీన్లు ఉంటే కట్ చెప్పడానికి సెన్సార్ మొహమాట పడినా అలాంటి సినిమాల్ని బుల్లితెరపై ప్రసారం చేయకుండా అడ్డుకోవడానికి ట్రాయ్ రెడీ అవుతోంది. ఇటీవలే గ్రాండ్ మస్తీని బుల్లితెరపై ఆడకుండా చేసింది టెలికాం అథారిటీ ట్రాయ్. కాబట్టి సన్నీ సినిమాలకు ఇక శాటిలైట్ పడిపోతే ఆటోమెటిగ్గా ఆ మేరకు డిమాండ్ తగ్గుతుందేమో చూడాలి.