ఫోటో స్టోరి: లిప్‌ కిస్ మీద సన్నీ సెటైర్‌

Update: 2016-05-13 06:43 GMT
మొన్ననే ఒక విషయం చెప్పుకున్నాం గుర్తుందా? తన సినిమాల్లో కిస్సింగ్‌ చేయకూడదని డిసైడ్‌ చేసుకుంది సన్నీ లియోన్‌. అమ్మడు రాగిణి ఎం.ఎం.ఎస్‌ సినిమాలో తప్పిస్తే.. ఆ తరువాత మరోసారి లిప్‌ కిస్‌ మాత్రం పెట్టలేదు. పైగా ప్రతీ సినిమా సైన్‌ చేసే ముందు.. నో-కిస్సింగ్‌ క్లాజ్‌ అంటూ ఎగ్రిమెంటులో పెట్టిస్తోందట. ఇది ఎంతవరకు నిజం?

అబ్బే.. నేను కిస్సింగ్‌ చేయను అని ఎవరన్నారు.. ఇదిగో కెమెరా ముందు కిస్సింగ్‌ చేస్తున్నా.. అంటూ అమ్మడు తన మొగుడు డానియల్‌ ను లిప్‌ కిస్‌ పెట్టుకుంటూ ఆ ఫోటోనో సోషల్‌ నెట్వర్క్ లో షేర్‌ చేసింది. అంతే కాదు.. ఈరోజు అమ్మడి పుట్టినరోజు కూడా. 35 ఏళ్ల వచ్చిన ఈ సెక్సీ సుందరిలో హాస్యచతురత ఏ రేంజులో ఉందో చూశారా? చాలామంది ఇప్పుడు ఈ సెటైర్‌ ను చూసి ఖంగుతిన్నారు.

అయితే పాప సెటైర్‌ వేసింది కానీ.. హీరోలను కిస్‌ చేయడం లేదు అనేది అందరూ చెప్పుకుంటున్న న్యూస్‌. వీళ్ళాయన్ను కెమెరా ముందు కిస్‌ చేసినా వెనుక చేసినా కూడా దానికి పాపాయికి రెమ్యూనరేషన్‌ ఇవ్వరు మరి. తెలుసా సన్నీ?
Tags:    

Similar News