మంచు వారబ్బాయితో స‌న్నీ రీ ఎంట్రీ

Update: 2022-03-07 08:34 GMT
గ‌త కొంత కాలంగా హీరో మంచు విష్ణు స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయ‌న హిట్ మాట విని దాదాపు నాలుగేళ్ల‌వుతోంది. గ‌త ఏడాది బారీ బ‌డ్జెట్ తో నిర్మించి న‌టించిన `మోస‌గాళ్లు` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది.

ఐటి కుంభ‌కోణం నేప‌థ్యంలో మంచు విష్ణు చేసిన ఈ మూవీని ఐదు భాష‌ల్లో విడుద‌ల చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఆలోచ‌న‌లో ప‌డిన మంచు విష్ణు కొంత విరామం త‌రువాత ఇంట్రెస్టింగ్ క్యారెక్ట‌రైజేష‌న్ తో ఓ సినిమాకు శ్రీ‌కారం చుట్టారు. ఈషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇందులో గాలి నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో మంచు విష్ణు న‌టిస్తున్నారు. ఇందుకు సంబంధించిన క్యారెక్ట‌ర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా మంచు విష్ణు విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. మంచు విష్ణు గ‌తంలో క‌నిపించ‌ని పాత్ర‌లో, డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో ఈ మూవీలో క‌నిపించ‌బోతున్న‌ట్టుగా తాజాగా విడుద‌ల చేసిన క్యారెక్ట‌ర్ స్కెచ్ తో స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా ఈ చిత్రానికి ఫేమ‌స్ రైట‌ర్ కోన వెంక‌ట్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.  

మంచు విష్ణు క్యారెక్ట‌ర్ గాలి నాగేశ్వ‌ర‌రావు క్యారెక్ట‌ర్ స్కెచ్ తో ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ అందించ‌డం మొద‌లుపెట్టిన ఈ మూవీ టీమ్ తాజాగా ఈ చిత్రంలోని రో కీల‌క పాత్ర‌కు సంబంధించిన స్కెచ్ ని సోమ‌వారం విడుద‌ల చేశారు. ఇందులో క్రేజీ లేడీ స‌న్నీ లియోన్ రేణుక పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలిసింది.

ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ స‌న్నీ లియోన్ సోష‌ల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ ద్వారా స్ప‌ష్టం చేసింది. ఈ రోజు మ‌రో జ‌ర్నీని మంచు విష్ణుతో క‌లిసి ప్రారంభించినందుకు చాలా థ్రిల్లింగ్ వుంది` అని తెలిపింది.  

గ‌తంలో మంచు మ‌నోజ్ న‌టించిన `క‌రెంటు తీగ‌` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన స‌న్నీ లియోన్ మ‌రో సారి మంచు వార‌బ్బాయితో క‌లిసి రీఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. పాత్ర‌ల ప‌రిచ‌యంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా, చోటా కె. నాయుడు ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడు జి. నాగేశ్వ‌ర‌రెడ్డి మూల కథ స‌మ‌కూర్చిన ఈ మూవీకి భాను - నందు డైలాగ్స్ రాస్తున్నారు. అవ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్నాయి.
Tags:    

Similar News