నేనేమైనా తక్కువ అంటూ మొదలు పెట్టిన సన్నీ

Update: 2020-01-29 01:30 GMT
ఈమద్య కాలంలో హీరోలు.. హీరోయిన్స్‌.. దర్శకులు అంతా కూడా సొంత నిర్మాణ సంస్థలు ప్రారంభించడం కామన్‌ అయ్యింది. బయట బ్యానర్‌ లో సినిమాలు చేయడం కంటే తమ బ్యానర్‌ లోనే సినిమాలు చేయడం వల్ల లాభాలు వస్తాయి కదా అని కొందరు భావించి నిర్మాణ సంస్థలు ప్రారంభిస్తే మరికొందరు మాత్రం కొత్త వారిని ప్రోత్సహించినట్లుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో నిర్మాణంలోకి అడుగు పెడుతున్నారు. ఎంతో మంది నిర్మాతలుగా మారుతున్నారు. నేను మాత్రం ఎందుకు నిర్మాత అవ్వొద్దు అనుకుందో లేదంటే కొత్త వారిని ఎంకరేజ్‌ చేయాలి అనుకుందో కాని సన్నీలియోన్‌ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతుంది.

ప్రస్తుతం హీరోయిన్‌ గా.. ఐటెం సాంగ్స్‌ చేస్తూ.. వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా వ్యవహరిస్తూ సన్నీలియోన్‌ బాగానే సంపాదించింది. అందుకే ఆమె నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించాలని భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే ఒక టీంను ఏర్పాటు చేసింది. మంచి కథలు మరియు కొత్త వారిని గుర్తించాలంటూ సూచించింది. ఆమె భర్త డేనియల్‌ ప్రస్తుతం నిర్మాణ సంస్థ విషయమై పూర్తి స్థాయిలో పని చేస్తున్నాడట.

వచ్చే ఏడాది సన్నీలియోన్‌ బ్యానర్‌ నుండి సినిమా రావడం ఖాయం అంటున్నారు. చిన్న బడ్జెట్‌ చిత్రాలతో పాటు వరుసగా వెబ్‌ సిరీస్‌ లను కూడా తెరకెక్కించే ఉద్దేశ్యంలో ఉన్నామని.. ఇంట్రెస్ట్‌ ఉన్న వారు సంప్రదించాలంటూ సన్నిహితులతో సన్నీలియోన్‌ సందేశాలు పంపిస్తుంది. హిందీతో పాటు సౌత్‌ కు కూడా సన్నీ లియోన్‌ తన నిర్మాణ సంస్థను విస్తరిస్తుందా అనేది చూడాలి. ఉత్తరాదినే కాకుండా సౌత్‌ లో కూడా సన్నీలియోన్‌ ను ఆరాధించే వారు చాలా మంది ఉన్నారనే విషయం తెల్సిందే.

Tags:    

Similar News