పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ కి సొంత త‌మ్ముడిలా!

Update: 2022-11-05 05:30 GMT
నిన్న మొన్న‌టివ‌ర‌కూ స‌న్నీసింగ్ అనే పేరు టాలీవుడ్ కి అంత‌గా సుప‌రిచితం కాదు. అత‌డు బాలీవుడ్ న‌టుడు. అక్క‌డ అద్భుత‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో న‌టించిన గొప్ప న‌టుడు. ఇప్పుడు తెలుగులో ఆదిపురుష్ 3డి చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నాడు. ప్ర‌భాస్ శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రంలో స‌న్నీసింగ్ ల‌క్ష్మ‌ణుడి పాత్ర‌ను పోషిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. రామాయ‌ణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సైఫ్ ఖాన్ లంకేష్ (రావ‌ణుడు)గా అల‌రించ‌నున్నారు. ఈ సినిమాలో కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

సీత కోసం వెతికే శ్రీ‌రాముడికి త‌మ్ముడు ల‌క్ష్మ‌ణుడు కొండంత అండ‌. ఇక సెట్స్ లో ప్ర‌భాస్ - స‌న్నీ ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిపోయార‌న్న టాక్ కూడా ఉంది. ఆన్ లొకేష‌న్ డార్లింగ్ కి ఒక‌సారి ప‌రిచ‌యం అయిపోతే ఇక ఎవ‌రైనా ఇట్టే క్లోజ్ అయిపోవాల్సిందే. ఇప్పుడు స‌న్నీ కూడా డార్లింగ్ కి చాలా క్లోజ్.

స‌న్నీ స‌హ‌జంగానే ప్ర‌తిభావంత‌మైన న‌టుడు. అత‌డికి ఇప్ప‌టికే హిందీ చిత్ర‌సీమ‌లో చ‌క్క‌ని గుర్తింపు ఉంది. ఇప్పుడు ద‌క్షిణాదికి అత‌డు ప‌రిచ‌యం అయిపోతున్నాడు. పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ 3డితో అత‌డి అవ‌కాశాల ప‌రిధి అమాంతం విస్త‌రించ‌నుంది. ఆదిపురుష్ 3డిలో లక్ష్మణుడి పాత్ర‌లో అత‌డి ఆహార్యం ఎలా ఉండ‌బోతోందో కాస్త వేచి చూడాలి. అయితే అంత‌కంటే ముందే స‌న్నీ సింగ్ నేప‌థ్యం గురించి తెలుసుకుంటే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్లు.. `సోను కే టిటు కి స్వీటీ`- `ప్యార్ కా పంచ్ నామా 2` -ఉజ్దా చమన్ స‌హా ఇతర బాలీవుడ్ చిత్రాలలో సన్నీ సింగ్ న‌టించాడు. అత‌డి విల‌క్ష‌ణ ఆహార్యం న‌ట‌న‌కు అద్భుత‌మైన పేరు ద‌క్కింది. 6 అక్టోబరు 1985న జన్మించిన సన్నీ సింగ్ నిజ్జర్ న‌టుడు కం మోడల్. అతను హిందీ చిత్రాలలో ప్రధానంగా కనిపిస్తాడు. 2011లో అతను `దిల్ తో బచ్చా హై జీ`లో ఒక‌ చిన్న పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆకాష్ వాణి (2013)లో ఒక పాత్రను పోషించాడు.

స్నేహితుని చిత్రం `ప్యార్ కా పంచ్ నామా 2` (2015) అతని మొదటి క‌మ‌ర్షియ‌ల్ హిట్. ఆ త‌ర్వాత‌ రొమాంటిక్ కామెడీ సోను కే టిటు కి స్వీటీ 2018లో విడుదలై అతనికి ఎక్కువ డబ్బును ఖ్యాతిని తెచ్చిపెట్టింది. సుదీర్ఘ కాలం ప్ర‌జ‌లు బాగా మెచ్చిన స్టార్ ప్లస్ సీరియల్ కసౌతి జిందగీ కేలో అతను క్రతికా సెంగార్ పాత్రలో న‌టించి మెప్పించాడు. ఇందులో ప్రేమకథలో అత‌డి న‌ట‌న టీవీక్ష‌కుల‌ను మెప్పించింది.  సింగ్ 2007లో తన టెలివిజన్ అరంగేట్రం చేసాడు. తర్వాత 2009 టెలివిజన్ ధారావాహిక `శకుంతల`లో అతను కరణ్ గా నటించాడు.

2011లో మధుర్ భండార్కర్ కామెడీ మూవీ `దిల్ తో బచ్చా హై జీ`తో పెద్ద‌తెర ఆరంగేట్రం చేశాడు. ఈ మూవీ పతాక సన్నివేశంలో ఇమ్రాన్ హష్మీ .. తో క‌లిసి కీల‌క‌ అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. లవ్ రంజన్ ప్రేమక‌థా చిత్రం `ఆకాష్ వాణి` బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో స‌న్నీ పేరు ఇండ‌స్ట్రీలో మార్మోగింది. అతను కార్తీక్ ఆర్యన్ -నుష్రత్ భరుచాతో కలిసి న‌టించాడు. ఇందులో రవి అనే దుర్మార్గపు భర్తగా నటన‌తో మెరిపించాడు.

ఇప్పుడు మ‌రో వైవిధ్య‌మైన పాత్ర‌లో అత‌డు న‌టిస్తున్నాడు. `ఆదిపురుష్‌`లో లక్ష్మణ్ పాత్రలో అతనిని చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే అత‌డు త‌దుప‌రి ఓ హారర్ కామెడీలో న‌టించేందుకు అంగీక‌రించ‌డం బిగ్ స‌ర్ ప్రైజ్. ఇది అతని హర్రర్ అరంగేట్రం చిత్రం. దీని గురించి సన్నీసింగ్ మాట్లాడుతూ -``నేను కామెడీలు.. రొమాంటిక్ కామెడీలు చేసాను. కానీ ఇది నా మొదటి హారర్ కామెడీ లేదా యాక్షన్ కామెడీ..జిన్ ట్రీ హారర్ కామెడీ మూవీ. ఇలాంటివి  చేయడానికి ఎల్ల‌పుడూ ఇష్టపడతాను. ప్రేక్షకులకు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఒక ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయి. సంజూ సర్ (సంజయ్ దత్) న‌టిస్తున్నందున ఇది భిన్నమైన సినిమాగా రికార్డుల‌కెక్క‌బోతోంది`` అని స‌న్నీ తెలిపారు. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌ను తాను పెద్ద తెర‌పై ఆవిష్క‌రించుకుంటున్న స‌న్నీకి ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ కూడా ఇక‌పై రెడ్ కార్పెట్ వేస్తుంద‌ని అత‌డి ప్ర‌తిభ గురించి తెలిసిన వారు సోష‌ల్ మీడియాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియ‌న్ డార్లింగ్ ప్ర‌భాస్ తో స్నేహం అత‌డికి పెద్ద ప్ల‌స్ కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News