తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే హీరోలు ఎన్.టి.ఆర్,ఏయన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు. తొలి తరం తెలుగు సినిమాని నిలబెట్టిన వీరు పరిశ్రమకు భుజ స్థంబాలుగా నిలిచారు. ఎన్.టి.ఆర్, ఏయన్నార్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూపర్ స్టార్ కృష్ణ. నేడు ఆయన మృతితో ఆ శకం ముగిసింది.. ఆ సువర్ణ అధ్యాయం పూర్తైంది. సినిమా తీయడమంటే ఏళ్లకు ఏళ్లు టైం తీసుకుంటున్న నేటి తరం తారలకు ఒకప్పుడు సినిమా కేవలం 25 రోజుల్లో పూర్తి చేసిన వారి గురించి మాట్లాడుకోవాల్సిందే.
ఈమధ్యనే కృష్ణం రాజు మృతితో తెలుగు పరిశ్రమ పెద్దను కోల్పోయిందని బాధపడగా నేడు మరో పెద్దదిక్కు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కృష్ణ అనగానే అందరికి గుర్తొచ్చే విషయాలు ఆయన సృష్టించిన రికార్డులు. సినిమా అంటే అందరిలా స్టార్ట్ చేశామా ఎండ్ చేశామా రిలీజ్ చేశామా అన్నట్టు కాకుండా సినిమా సినిమాకు కొత్త టెక్నాలజీని పరిచయం చేయాలన్న ఆయన ఆలోచనకు ప్రతి ఒక్కరు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
కృష్ణ గారు ఆవిష్కరించిన కొత్త విషయాలను గురించి ఒకసారి ప్రస్తావిస్తే.. ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ గూడచారి 116, ఫస్ట్ కౌ బోయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు.. మొదటి 70 ఎం.ఎం సినిమా సింహాసనం తీశారు కృష్ణ. ఫస్ట్ సినిమా స్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామ రాజు మూవీతో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఈస్ట్ మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు. ఇక ఒకే ఏడాది 17 సినిమాలను రిలీజ్ చేసిన ఒకే ఒక హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమాల కోసం రోజుకి 3 షిఫ్ట్ లు పనిచేశారట కృష్ణ.
ఉదయం అప్పటి మద్రాస్ ఇప్పటి చెన్నైలో షూటింగ్ లో పాల్గొని.. మధ్యాహ్నం ఫ్లైట్ లో బెంగళూరు వెళ్లి అక్కడ సాంగ్ షూట్ చూసుకుని.. ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లో నైట్ షెడ్యూల్ కి వచ్చే వారట. అక్కడ నైట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని మళ్లీ నెక్స్ట్ డే మద్రాస్ లొ డే షూటింగ్ లో పాల్గొనే వారట.
ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్థానం సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఒక పేరు మాత్రమే కాదు అది ఒక బ్రాండ్. తెలుగు సినిమాని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లిన ఒక మహా మనిషి పేరు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన సినిమాలు.. ఆయన జ్ఞాపకాలు పరిశ్రమ ఉన్నంత వరకు ఉంటాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.