మేనల్లుడు కోసం మహేష్ టెన్షన్ పడుతున్నాడా? అంటే అవుననే సమాచారం. అయితే ఆ టెన్షన్ ఎందుకు? అంటే వివరాల్లోకి వెళ్లాలి. సూపర్ స్టార్ మహేష్ మేనల్లుడు.. ఎంపీ గల్లా జయ దేవ్ తనయుడు అశోక్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రారంభమై క్యాన్సిలైన సంగతి తెలిసిందే. `ఆడు మగడ్రా బుజ్జి` ఫేం కృష్ణారెడ్డి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. స్క్రిప్టు విషయంలో మహష్ సంతృప్తిగా లేక పోవడంతోనే ఆ సినిమా ఆగి పోయినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అప్పటి నుంచి అశోక్ ఎంట్రీ సస్పెన్స్ లో పడింది. మేనల్లుడు కోసం మహేష్ చాలా కథలు విన్నాడు. కానీ అవేవీ నచ్చలేదు. తాజాగా శమంతక మణి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన స్టోరీ కనెక్టయ్యింది. ప్రస్తుతం మేనల్లుడి నిర్మాత కూడా మారారు. దిల్ రాజ్ స్థానంలో పద్మ గల్లా వచ్చి చేరారు.
మహేష్ అక్క.. అశోక్ తల్లి గారైన పద్మ గల్లా ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం కానుంది. దీంతో అశోక్ ఎంట్రీ పై పూర్తి క్లారిటీ వచ్చింది. మేనల్లుడి విషయంలో మహేష్ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడిని మార్చాడు. నిర్మాతగా సిస్టర్ ని రంగంలోకి దించాడు. తనయుడి సినిమా తోనే తల్లిని నిర్మాతగా పరిచయం చేస్తున్న క్రెడిట్ మహేష్ కే దక్కుతుంది. కావాలనుకుంటే మహేష్ బాబు సొంత బ్యానర్ ఎంబీ ప్రొడక్షన్స్ లో అశోక్ ని లాంచ్ చేయగలడు. మేనల్లుడికి కావాల్సిన బూస్ట్ ఇవ్వగలడు. కానీ అలా చేయలేదు. సొంత అక్కనే బరిలోకి దించడమే ఇక్కడ ఆసక్తిని కలిగిస్తోంది.
అంటే భవిష్యత్ లో పద్మ నిర్మాతగా కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ముందుగా అశోక్ ని పెద్ద స్టార్ ని చేయడమే లక్ష్యంగా పక్కా ప్లానింగ్ తోనే పద్మ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. బ్యాక్ ఎండ్ లో మహేష్-నమ్రతల సపోర్ట్ కూడా ఉంటుంది కాబ్టటి పద్మకు సినీనిర్మాణం పరంగా పనులు సులభం అయ్యే అవకాశం ఉంది. గల్లా పద్మ అనధికారికంగా బిజినెస్ ఉమెన్ అన్న సంగతి తెలిసిందే.