ఈ క్రైసిస్ లో షూటింగుల‌కు స‌సేమిరా అనేసిన సూప‌ర్ స్టార్!

Update: 2020-09-30 05:15 GMT
70 ప్ల‌స్ వ‌య‌సులోనూ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్.. ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం.. ఇళ‌య‌రాజా.. వంటి ప్ర‌ముఖులు ఎంతో నూత‌నోత్సాహంతో క‌నిపించ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. 70 కి చేరువ‌లో ఉన్నారు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఈ ఏజ్ లోనూ వ్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త వంటి అంశాల్లో వీళ్లంతా లెజెండ్స్ గా చ‌రిత్ర‌కెక్కారు.

అయితే ఇటీవ‌లే గాన‌గంధ‌ర్వుడు కోవిడ్ 19 కి చికిత్స పొందినా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క దివికేగారు. వ‌య‌సు దృష్ట్యా చూస్తే బాలుకు 74 సంవ‌త్స‌రాలు .. ఓబేసిటీ ట్రీట్ మెంట్ స‌హా జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు వంటివి ఆయ‌న‌కు పెద్ద స‌మ‌స్యాత్మ‌కం అయ్యాయ‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి.

ఇక‌పోతే కోవిడ్ తో సంబంధం లేకుండా 2.0 స‌మ‌యంలోనే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి ఆరోగ్య స‌మ‌స్య‌లు తలెత్తిన సంగ‌తి విధిత‌మే. దాంతో ఆయ‌న ఆధ్యాత్మిక చింత‌న‌కే స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నారు. రాజ‌కీయారంగేట్రం అంటూ ప్ర‌చార‌మైనా ఆయ‌న ఆ దిశ‌గా వేగం పెంచక‌పోవ‌డానికి ఇలాంటి కార‌ణ‌మే ఉంటుంద‌ని భావిస్తున్నారు. అన్నీ బావుంటేనే షూటింగులైనా.. రాజ‌కీయాలైనా.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ ప‌లు సినిమాల‌కు సంత‌కాలు చేసి ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా ఆయ‌న ఎంతో ఉత్సాహంగానే ఉన్నారు. అయితే కోవిడ్ విష‌యంలోనే ఆచితూచి అడుగులేయాల్సి వ‌స్తోంది. చెన్న‌య్ స‌హా త‌మిళ‌నాడులో కోవిడ్ విల‌య‌తాండ‌వం ఆడుతోంది. దేశంలో ఎక్క‌డా ప‌రిస్థితి బాలేదు. ఇలాంటి ప‌రిస్థితిలో వ‌య‌సు దృష్ట్యా అయినా తాను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకే నిర్మాత‌లు సెట్స్ కి రావాల్సిందిగా కోరినా కానీ స‌సేమిరా అనేస్తున్నార‌ట‌.

ర‌జ‌నీ వయసు 69 సంవత్సరాలు. ఈ ఏజ్ లో వైరస్ సంక్రమిస్తే ఇది తీవ్రమైన ప్రమాదానికి కారణమ‌వుతుంది. అందుకే వ్యాక్సినో టీకానో వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడాల‌న్న ధోర‌ణితో ఆయ‌న ఉన్నార‌ట‌. దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు పెద్దాయ‌న్ని బ‌ల‌వంత పెట్ట‌డం లేదు. ర‌జ‌నీతో గ్రామీణ నేప‌థ్యంలో ద‌రువు శివ ఓ భారీ చిత్రం రూపొందించాల‌ని భావించారు. స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే 2020 దీపావ‌ళికే మూవీని రిలీజ్ చేసేయాల‌ని వ‌ర్క్ చేసినా కోవిడ్ వ‌ల్ల‌ ప్లాన్ ఫ్లాపైంది. సంక్రాంతికి కూడా ఇప్పుడు ఛాన్స్ లేదు. 2021 వేస‌వి నాటికి కానీ ఈ మూవీని తేలేమ‌ని భావిస్తు్నార‌ట‌.
Tags:    

Similar News