సూపర్‌స్టార్ కృష్ణ ఇటీవలి కాలంలో నటనకు దూరంగా ఉన్నారు. కొన్నేళ్లుగా ముఖానికి రంగేసుకున్నదే లేదు. సూపర్‌స్టార్ తనంతట తానుగా నటిస్తా అనేంత గొప్ప కథలు కానీ, క్యారెక్టర్లు కానీ మన దర్శకరచయితలు క్రియేట్ చేయలేకపోయారు. అందుకే ఆయన తెరవెనకే ఉండిపోయారు. అయితే ఇన్నాళ్టికి సీనియర్ దర్శకుడు ముప్పలనేని శివ ఓ కథ చెప్పి ఇన్‌స్పయిర్ చేయడంతో సినిమాలో నటించేందుకు అంగీకరించారు.
ప్రస్తుతం శివ దర్శకత్వంలో కృష్ణ - విజయనిర్మల జోడీగా సినిమా ఆన్ సెట్స్ ఉంది. ఈ చిత్రానికి శ్రీశ్రీ అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్‌కి ఇన్‌స్పిరేషన్ మహాకవి శ్రీశ్రీనే. ఆయన ప్రేరణతోనే ఈ సినిమా లో క్యారెక్టరైజేషన్ ఉంటుందని చెబుతున్నారు. ఇదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకపోయినా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటుందని చెబుతున్నారు కృష్ణ. ఏడేళ్ల వయసప్పుడు నటుడినయ్యాను. 70లోనూ నటిస్తూనే ఉన్నా అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారాయన. శివ చెప్పిన క్యారెక్టరైజేషన్, కథ నచ్చి అంగీకరించానని చెప్పారు. ఫిబ్రవరి 12, 2016లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. కృష్ణ హీరోగా ముప్పలనేని శివ దర్శకత్వంలో ఘరానా అల్లుడు 1994లో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇంతకాలానికి ఈ కలయికలో సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఇప్పుడు 70లలోనూ హిట్ కొడితే.. సీనియర్ సూపర్ స్టార్ కు తిరుగుండదంతే.