లాక్ డౌన్ టైమ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న మహేష్

Update: 2020-03-31 06:10 GMT
మహేష్ బాబు.. సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో కూలెస్ట్ సూపర్ స్టార్ గా పిలవబడుతుంటాడు. షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. వారాంతంలో మాత్రం తప్పకుండా తన కుటుంబంతోనే ఆయన గడుపుతారు. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారిని టూర్లకు, ఔటింగ్స్‌కు తీసుకెళ్తూ ఉంటారు. అంతే కాదు వారికి తనదైన శైలిలో ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల షూటింగులు లేక అందరూ సెలెబ్రెటీల ఇళ్లకే పరిమితమయ్యారు.

మన సూపర్ స్టార్ మహేష్ కూడా తన ఫ్యామిలీతో క్వారంటైన్ టైమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన భార్య నమ్రత, పిల్లలు సితార, గౌతమ్ కృష్ణ లతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకడంతో మహేష్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే నమ్రత తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఈ ఫోటోలో మహేష్ బాబు తన లివింగ్ రూమ్ లో ఒక సోఫాపై నైట్ ట్రాక్ వేసుకొని కూర్చుని నవ్వుతూ ఉన్నాడు. ఈ ఫోటో చూస్తే అర్థం అవుతోంది వాళ్ళ మధ్య ఏదో కామెడీ డిస్కషన్ జరుగుతుందని. మొన్నీ మధ్య మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టు మహేష్ బాబు సెన్స్ ఆఫ్ హుమర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటి నుంచి కూడా సూపర్ స్టార్ గా ఫుల్ బిజీ గా ఉంటూనే ఫ్యామిలీ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాడు మహేష్. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను, ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే. ఈ ఫోటో షేర్ చేసినందుకు అభిమానులు నమ్రతకు థాంక్స్ చెప్పుకుంటున్నారు.
Tags:    

Similar News