సుశాంత్ కేసు సీబీఐకి.. స్పందించిన సుప్రీం

Update: 2020-07-30 12:30 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు సుప్రీం కోర్టుకు చేరింది. సుశాంత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది.

‘ఒక వ్యక్తి మంచోడా.. చెడ్డోడా అన్నదానిపై కాదు.. కానీ ఈ కేసును ముంబై పోలీసులు విచారిస్తున్నారు. అందుకే ఈ పిటీషన్ ను కొట్టివేస్తున్నాం’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

అల్కా ప్రియ అనే మహిళ సుప్రీంలో ఈ మేరకు సుశాంత్ కేసుపై పిటీషన్ దాఖలు చేశారు. సుశాంత్ చాలా మంచోడని.. నాసాకు వెళ్లేందుకు చాలా మంది పిల్లలకు అతడు సాయం చేశాడని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది.

కాగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ తాజాగా రియాతోపాటు మరో ఆరుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మలుపుతిరిగింది. రియా కుట్ర చేసి తమ కుమారుడు సుశాంత్ ను కుటుంబానికి దూరం చేసిందని.. తన కుమారుడి బ్యాంక్ అకౌంట్ ని ఆమెనే హ్యాండిల్ చేసేదని ఆయన ఆరోపించారు.

సినిమాలు వదిలి వ్యవసాయం చేద్దామనుకున్న సుశాంత్ ను రియానే బ్లాక్ మెయిల్ చేసి.. మెడికల్ హిస్టరీని బయటపెడుతానని బెదిరించిందని కేకే సింగ్ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
Tags:    

Similar News