ఏయన్నార్‌ మనవరాలా మజాకా!!

Update: 2018-09-24 04:54 GMT
నందమూరి ఫ్యాన్స్‌ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్‌’. బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తూ ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదలవుతున్న నేపథ్యంలో అంచనాలు పెరిగి సినిమా బిజినెస్‌ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ గా బాలయ్య - చంద్రబాబు నాయుడుగా రానా లుక్‌ లు రివీల్‌ అయ్యాయి. తాజాగా ఏయన్నార్‌ గా సుమంత్‌ లుక్‌ బయటకు వచ్చింది.

ఏయన్నార్‌ ను దించేసినట్లుగా లుక్‌ ఉందంటూ విమర్శకుల ప్రశంసలు మరియు అక్కినేని అభిమానులు అంటున్నారు. తాత గారిని దించేశాడు అంటూ ప్రశంసలు కురుస్తున్న నేపథ్యంలో సుమంత్‌ తెగ సంతోష పడుతున్నాడు. తాజాగా ఈ విషయమై ఒక ఇంటర్వ్యూలో మీడియాతో మాట్లాడుతూ తన లుక్‌ ఇంత పర్‌ ఫెక్ట్‌ గా రావడానికి ప్రధాన కారణం సుప్రియ అంటూ చెప్పుకొచ్చాడు. సుమంత్‌ సోదరి సుప్రియ ఏయన్నార్‌ కు చాలా క్లోజ్‌ గా ఉండే వారు, ఏయన్నార్‌ వద్దే ఆమె పెరిగిన విషయం తెల్సిందే.

ఏయన్నార్‌ పాత్రను ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో చూపించబోతున్నట్లుగా తెలిసిన సమయంలో తాతగారికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను ఆమె స్వయంగా దర్శకుడు క్రిష్‌ కు అందజేయడం జరిగిందట. ఇక లుక్‌ పరంగా అనేక మార్పులు చేర్పులు చేసిన తర్వాత తాజాగా విడుదల చేసిన లుక్‌ కు ఫిక్స్‌ అయ్యాం. అయితే కొందరు కొన్ని మార్పులు సూచించారు. ఆ మార్పులు చేయాలా వద్దా అని భావిస్తున్న సమయంలో సుప్రియ ఏం పర్వాలేదు ఈ లుక్‌ ఫైనల్‌ చేయడం - నిజంగా తాతగారిని దించేసినట్లుగా ఉంది అంటూ సలహా ఇచ్చిందట. దాంతో సుప్రియ మాట ప్రకారం అదే లుక్‌ను విడుదల చేయగా ఫలితం ఏంటో అందరికి తెల్సిందే. అందుకే సుప్రియ జడ్జ్‌ మెంట్‌ విషయంలో సూపర్‌ అంటూ అంతా అంటూ ఉంటారు.

చాలా కాలం తర్వాత నటిగా ‘గూఢచారి’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సుప్రియ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆమె చూసుకుంటూ ఉంటారు. మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News