సామాజిక మాధ్యమాల్లో స్పీడ్ గా ఉండే యూత్ కి ఈ స్టార్ మామ్ అండ్ డాటర్ ని పరిచయం చేయాల్సిన పని లేదు. సహాయనటి సురేఖా వాణి తన కుమార్తె సుప్రీత గురించే ఈ మాట. కుమార్తె సుప్రీత రెగ్యులర్ గా సామాజిక మాధ్యమాలు సహా.. వీడియో షేరింగ్ సైట్ లలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో రకరకాల వీడియోల్ని అప్ లోడ్ చేస్తూ అభిమానులను పెంచుకుంటోంది. అందులో ఫన్ తో కూడుకున్నవి వాటితో పాటు ఎమోషన్ తో కూడుకున్నవి ఉన్నాయి. అయితే ఇదే వేదికపై తన తండ్రి మరణానంతరం ఆవేదనను షేర్ చేసారు.
ఇక ఇటీవలి కాలంలో తన మదర్ సురేఖ వాణితో కలిసి సెలబ్రేషన్ మోడ్ లో ఉన్న రకరకాల ఫోటోలు వీడియోలను షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా సుప్రీత పుట్టినరోజు సందర్భంగా సురేఖవాణి సోషల్ మీడియాలో బర్త్ డే వేడుకల నుంచి ఓ ఫోటోని పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. సుప్రీత తన 21 వ పుట్టినరోజును జరుపుకుంది. తన కుమార్తెపై ఒక వర్కింగ్ మదర్ గా తన ఎమోషన్ ని సురేఖవాణి దాచుకోలేదు.
తన దివంగత భర్తను గుర్తుచేసుకుంటూ సురేఖవాణి ఎమోషనల్ నోట్ రాసారు. ``పుట్టినరోజు శుభాకాంక్షలు కన్న (చిట్టి తల్లి మా).. మీ నాన్నగారు నీకు కాల్ చేస్తూ ఇలా పిలుస్తారు ..! నేను ఆయనను ఎంత కోల్పోతున్నానో నాకు తెలుసు ..! మీకు ఎల్లప్పుడూ నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను`` అంటూ ఎమోషనల్ అయ్యారు. సురేఖ 2019 లో తన భర్తను కోల్పోయారు. తన గురించి అంతర్గతంగా బాహ్యంగా తన కుమార్తెకు మాత్రమే తెలుసునని సురేఖ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ప్రపంచంలో నాకు అత్యుత్తమ కుమార్తెను ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు ..! ఈ జీవితంలో నిన్ను మించి మరొకరిని ప్రేమించలేను ..! కాదు.. నా తదుపరి జీవితంలో కూడా..! నీ ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుడిని ప్రార్థిస్తాను.. లవ్ యు లోడ్స్..! అంటూ వ్యాఖ్యను జోడించారు.
పుట్టినరోజు వేడుకలో సురేఖ- సుప్రీత ఒకే రకమైన దుస్తులను ధరించారు. సురేఖ రెడ్ హై స్లిట్ డ్రెస్ లో కనిపిస్తే.. సుప్రీత బ్లాక్ హై స్లిట్ డ్రెస్ లో కనిపించారు. ఎత్తు మడమల చెప్పులతో స్పెషల్ గా కనిపిస్తున్నారు. ఆ ఇద్దరూ అక్కా చెల్లెళ్లు కాదు కదా! అంటూ చూపరులంతా కన్ఫ్యూజ్ అయ్యేంతగా సురేఖవాణి తన గ్లామర్ ని మెయింటెయిన్ చేయడం అన్నివేళలా పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ ఫోటోలో పుట్టినరోజు యాంబియెన్స్ కి తగ్గట్టే నేపథ్యంలో బెలూన్ లు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి.