ఫస్ట్ డే తేడాలొచ్చాయ్ కాని..

Update: 2016-12-09 03:17 GMT
రామ్ చరణ్ మూవీ ధృవ.. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్. రెండు రోజులుగా ఇటు తెలుగు ఆడియన్స్ లోను.. సోషల్ మీడియాలోనూ నానా హంగామా చేస్తుండగా.. నిన్న రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 150 టీజర్.. చెర్రీ స్పీడ్ ని ఓవర్ టేక్ చేసేసింది. అయినా సరే.. రెండూ మెగాభిమానులకు హుషారు ఇచ్చే కాన్సెప్టులే కావడంతో.. ఫ్యాన్స్ తెగ ఊగిపోయారు. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. విలన్ గా నటించిన అరవింద్ స్వామితో మొదట తేడాలు వచ్చాయంటూ చెప్పేశాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

తమిళ్ మూవీ తని ఒరువన్ లో విలన్ గా నటించి మెప్పించిన తర్వాత.. తెలుగు వెర్షన్ ధృవ కోసం అరవింద్ స్వామినే అడిగారు. కానీ నెగిటివ్ పాత్రల్లో కంటిన్యూ కావడం ఇష్టం లేని అరవింద్ స్వామి.. ఈ ఆఫర్ ని తిరస్కరించాడని అన్నాడు సూరి. 'అప్పుడు తెలుగు వెర్షన్ కోసం సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను అరవింద్ స్వామికి వివరించాను. వెంటనే తను ఈ రోల్ చేయడానికి ఉత్సాహం చూపించి ఒప్పుకున్నారు' అని చెప్పిన సురేందర్ రెడ్డి.. తామిద్దరికీ ఎక్కడ తేడాలొచ్చాయో కూడా వివరించాడు.

'తొలి రోజన షూటింగ్ విషయంలో నాకు-అరవింద్ స్వామికి మధ్య కొన్ని విషయాల్లో తేడాలు వచ్చాయి. వెంటనే వీటిపై ఇద్దరం కాసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యి మాట్లాడుకున్నాం. ఆయన చాలా సీనియర్ యాక్టర్. పైగా ప్రొఫెషనల్. నా టేకింగ్ స్టైల్ అర్ధం అయ్యాక.. ప్రతీ విషయంలోనూ హెల్ప్ చేశారు. ఎంతో సపోర్టివ్ కూడా. ఆ తర్వాత మొత్తం షూటింగ్ లో చిన్న విషయంలో కూడా మా ఇద్దరికీ విబేధాలు రాలేదు' అన్నాడు సురేందర్ రెడ్డి.
Tags:    

Similar News