సినిమాలులో నటిస్తూనే అక్కినేని నాగార్జున హోటల్ బిజినెస్ - ప్రొడక్షన్ హౌస్ విజయవంతంగా నడిపిస్తున్నాడు. నాగార్జున వేసిన బాటలోనే కొద్ది మంది యంగ్ హీరోలు సందీప్ కిషన్ - శర్వానంద్ - శశాంక్ - నితిన్.. రైటర్ కోన వెంకట్.. డైరక్టర్ వెంకట్ కూచిపూడి లాంటి వాళ్ళు కూడా తమ సొంత బిజినెస్ స్టార్ట్ చేశారు. మొన్ననే అల్లు అర్జున్ కూడా పబ్ బిజినెస్ లోకి దిగాడు. ఇప్పుడు ఇలాంటివారి లిస్ట్ లోకి మరో స్టార్ డైరెక్టర్ కూడా చేరిపోయాడు.
‘రేసుగుర్రం’ - ‘ధృవ’ లాంటి బాక్స్ ఆఫీసు హిట్లు డైరెక్ట్ చేసిన తెలుగు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇప్పుడు బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడు. సురేందర్ రెడ్డి హైదరాబాద్ సిటీ శివారులలో ఒక హై క్లాస్ హోటల్ నిర్మాణంతో తలములకై ఉన్నాడట. బిజినెస్ క్లాస్ హోటల్ తో పాటుగా ఇంటర్ కాంటినెంటల్ డిషెస్ కూడా అందుబాటులో ఉన్న ఒక పోష్ రెస్టారెంట్ నిర్మిస్తున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్న సురేందర్ రెడ్డి వీలు దొరికినప్పుడు హోటల్ నిర్మాణంతో మిగిలిన సమయం కేటాస్తున్నాడట.
ఈ మధ్యే సందీప్ కిషన్ ‘వివాహభోజనంబు’ మొదలుపెట్టాడు, మరో హీరో నితిన్ కూడా ‘టి- గ్రిల్’ మొదలుపెట్టి విజయం సాధింధడు. అలాగే అల్లు అర్జున్ కూడా 'జూబ్లీ 800' అంటూ క్లబ్బింగ్ బిజినెస్ షురూ చేశాడు. మురళి మోహన్ - అల్లు అరివింద్ - దాసరి లాంటి వాళ్ళు ఫిల్మ్ ప్రొడక్షన్ తో పాటు ఇతర వ్యాపారాలు చేసి అక్కడ కూడా విజయభావుట ఎగరవేశారు.. ఇప్పుడు అదే బాటలో అందరూ పయనిస్తున్నారు. కాకపోతే వీళ్ళు హోటళ్ళు పెడుతున్నారు.