సూరి- కళ్యాణ్‌ రామ్‌ డిఫరెన్సెస్‌ నిజమా?

Update: 2015-08-30 04:01 GMT
కిక్‌ -2 ఫలితం ఏదైనా కిక్‌ 3 తీసి తీరతామన్నట్టే మాట్లాడాడు సురేందర్‌ రెడ్డి. అంటే దానర్థం కళ్యాణ్‌ రామ్‌ తో, రవితేజతో తనకి సఖ్యత బాగానే ఉందని చెప్పకనే చెప్పాడు. కానీ సీన్‌ లోకి ఎంటరైతే మొత్తం రివర్స్‌ స్క్రీన్‌ప్లే లో ఉన్నట్టే అనిపిస్తోంది. అసలు ఈ ముగ్గురి మధ్యా ఏం జరుగుతోంది? అన్నదానికి ఇప్పటివరకూ క్లారిటీ లేనేలేదు. అంతా కలిసే ఉన్నాం.. అంటున్నారు. కానీ ఎవరూ కలిసి లేరన్న సిగ్నల్స్‌ వస్తున్నాయి. ఫిలిం ప్రొడక్షన్‌ టైమ్‌ లోనే సురేందర్‌ రెడ్డితో కళ్యాణ్‌ రామ్‌ విభేధించారని వార్తలొచ్చాయి. రిలీజ్‌ తర్వాత ఫలితం నెగెటివ్‌ గానే వచ్చింది.

అయితే రిలీజ్‌ ముందే రవితేజ సినిమాపై తన జడ్జిమెంట్‌ చెబుతూ ద్వితీయార్థంలో లెంగ్త్‌ కట్‌ చేస్తే బావుంటుందని సూచించాడు. కానీ సురేందర్‌ రెడ్డి దానికి అంగీకరించలేదు. అలానే సినమా రిలీజ్‌ చేసేశారు. కానీ మొదటి రోజు ఫ్లాప్‌ టాక్‌ వచ్చింది. దాంతో వెంటనే రియలైజ్‌ అయిన కళ్యాణ్‌ రామ్‌ సురేందర్‌ రెడ్డితో చెప్పకుండానే సెకండాఫ్‌ లో విలేజ్‌ సన్నివేశాల్ని చాలా వరకూ కట్‌ చేయించాడట. సూరీని కళ్యాణ్‌ రామ్‌ సంప్రదించకుండా ఇలా చేస్తే వారి మధ్య సఖ్యత ఉన్నట్టా లేనట్టా? అసలింతకీ ఏం జరుగుతోంది?

ఇలా అయితే కిక్‌ 3 ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలొస్తున్నాయి. ముగ్గురూ ట్యాలెంటెడ్‌ పర్సనాలిటీస్‌. జెంటిల్మన్‌. కాబట్టి త్వరలోనే మిస్‌ కమ్యూనికేషన్‌ నుంచి బైటపడి కలిసిపోవాలని కోరుకుందాం.
Tags:    

Similar News