సమ్మర్ లోనే విడుదల కావాల్సిన కిక్-2 సినిమా ఇంత ఆలస్యం ఎందుకైంది? ఎవ్వరికీ అంతుబట్టని విషయమిది. ఐతే నిర్మాత కళ్యాణ్ రామ్ కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి విభేదాలు నెలకొన్నాయని.. హీరో రవితేజ కూడా కళ్యాణ్ రామ్ కు దూరమయ్యాడని వార్తలు వినిపించాయి. ఐతే ఇందులో వాస్తవమెంత అన్నది సందేహంగానే ఉంది. ఆడియో ఫంక్షన్ అయ్యాక ఈ ముగ్గురూ ఎక్కడా కలిసి కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇంతలో రిలీజ్ డేట్ దగ్గరికొచ్చేసరికి ప్రమోషన్ సంగతి గుర్తుకొచ్చి.. శుక్రవారం రాత్రి ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఏర్పాటు చేశాడు కళ్యాణ్ రామ్. ఈ వేడుకకు సురేందర్, రవితేజ వస్తారా లేదా అని చాలామందికి డౌటుంది. కానీ వాళ్లిద్దరూ ఫంక్షన్ కు వచ్చారు.
ఇంతటితో ఊహాగానాలన్నింటికీ తెరపడిపోతుందేమో అనుకుంటే.. ఇక్కడే అసలు కథ మొదలైంది. వేడుకలో కళ్యాణ్ రామ్ - సురేందర్ - రవితేజ.. ముగ్గురూ ముగ్గురే అన్నట్లున్నారు. వీరి మధ్య సఖ్యత లేని సంగతి ఫంక్షన్ లో స్పష్టంగా తెలిసిపోయింది. ఫొటోల కోసం మొక్కుబడి కౌగిలింతలు అవీ చేసుకున్నారు కానీ.. సరైన పలకరింపు లేదు. ఒకరితో ఒకరు సఖ్యతతో ఉన్నది లేదు. కళ్యాణ్ రామ్.. హీరో, డైరెక్టర్ లకు దూరం పాటిస్తూ తన పెదనాన్న రామకృష్ణ పక్కన కూర్చున్నాడు. లేటుగా ఫంక్షన్ కు వచ్చిన రవితేజ.. కళ్యాణ్ రామ్ పక్కన ఖాళీ ఉన్నా కూర్చోకుండా వేరే చోటు వెతుక్కున్నాడు. మరోవైపు సురేందర్ రెడ్డి కూడా కళ్యాణ్ రామ్ కు దూరంగా ఉన్నాడు. వేదికెక్కినపుడు కూడా ఇద్దరి మధ్య ఒకప్పటి సాన్నిహిత్యం కనిపించలేదు. కళ్యాణ్ రామ్ కు దూరంగా ఉండి.. మళ్లీ తామిద్దరం క్లోజ్ అయితే బాగుండదేమో అనుకున్నారో ఏంటో కానీ.. ఈ వేడుకలో సురేందర్, రవితేజ కూడా కొంచెం దూరంగా దూరంగా ఉండటం విశేషం.