మైత్రితో సురేష్ వారి ఒప్పందం?

Update: 2018-04-26 18:41 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం థియేటర్స్ చాలానే ఉన్నాయి. అయితే అప్పుడపుడు పెద్ద సినిమాలు రిలీజైతే చిన్న సినిమాల కష్టం వర్ణణాతీతం. ఆ సినిమా విడుదల అవ్వడం కష్టంగా మారుతోంది. అయితే థియటర్స్ కొందరి ఆధీనంలోనే ఉన్నాయనే ఆరోపణలు ప్రతిసారి రావడం కామన్. అయితే ఆ థియేటర్స్ ఏర్పడడానికి కారణం సినిమా పెద్దలకు కొంత భాగముంది ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే వారికి నచ్చిన సినిమాలను, బిజినెస్ చేసే సినిమాలనే రిలీజ్ చేసుకుంటారు.

ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సరికొత్త ఒప్పందాన్ని కుదర్చుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కొన్ని థియేటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సురేష్ ప్రొడక్షన్ కి పట్టుంది కాబట్టి ఒకే. ఇక మైత్రి నిర్మాతలు ఎన్నారైలు కాబట్టి ఓవర్సీస్ కూడా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. సినిమాల నిర్మాణం ద్వారా కాకుండా ఇలా థియేటర్స్ ద్వారా ఒక బిజినెస్ సాగుతుంది.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మైత్రి వారు నిర్మించబోయే సుకుమార్ - మహేష్ ప్రాజెక్ట్ లో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ వస్తోంది. సుకుమార్ చెప్పిన పాయింట్ లో విలన్ రోల్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటున్నారట. అందుకే ముందుగానే రానాతో ఆ విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. మరి బాహుబలి విలన్ మహేష్ బాబుతో పోరాడడానికి సిద్ధంగా ఉంటాడా లేదా అనేది అధికారికంగా వెలువడేంత వరకు వెయిట్ చేయాల్సిందే..    


Tags:    

Similar News