దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కల్లోలం చూస్తున్నదే. కోవిడ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. దీంతో ఆస్పత్రులు నిండాయి. బెడ్లు చాలక రోగుల పరిస్థితి అయోమయంగా మారింది. ఇక నిరంతర సేవల్లో ఉన్న వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కోవిడ్ ఆస్పత్రులను విడిచి ఇళ్లకు వెళ్లే అవకాశమే లేదు. ఆస్పత్రుల విభాగాల్లో ఎవరికీ విశ్రాంతి అన్నదే లేదు.
ఈ పరిస్థితికి చలించిన పలువురు సినీసెలబ్రిటీలు ఫ్రంట్ లైన్ వారియర్స్ కి సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తాజా సమాచారం మేరకు వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ లో కోవిడ్ విభాగం వైద్యుల కోసం బసలు ఏర్పాటు చేస్తున్నారు. ఖరీదైన హోటళ్లకు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా ప్రభుత్వానికి డి.సురేష్ బాబు- అభిరామ్ బృందాలు ఫిలిం స్టూడియోస్ లోనే ఏర్పాట్లు చేస్తున్నారు. సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ స్వయంగా దగ్గరుండి ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు.
విశాఖ బీచ్ పరిసరాల్లోని రామానాయుడు స్టూడియోస్ .. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వంటి వాటికి ప్రభుత్వం భూములు కేటాయించిన సంగత తెలిసిందే. త్వరలోనే వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ పరిసరాల్లోనే ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ని కొన్ని ఎకరాల్లో నిర్మించేందుకు ప్రభుత్వ అనుమతులు లభించాయని తెలిసింది.