పిట్టగోడ నుంచి కలల ప్రపంచంలోకి..

Update: 2016-12-22 15:30 GMT
డిసెంబర్ 24న చిన్న సినిమాగా రిలీజ్ కానున్న పిట్టగోడపై.. టాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. బడా నిర్మాత సురేష్ బాబు ఎంట్రీ తర్వాత ఈ చిత్రంపై హోప్స్ మరింతగా పెరిగిపోయాయి. పెళ్లిచూపులు టైపులో సంచలనం సాధించినా ఆశ్చర్యంలేదని టాలీవుడ్ ఆశిస్తుండగా.. ఇప్పుడీ మూవీలో తాను భాగం కావడంపై పెదవి విప్పారు సురేష్ బాబు.

'మంచి చిత్రాలను తీయడంలో టేస్ట్ ఉన్న నిర్మాత రామ్మోహన్ పి మూవీ కావడంతో ఆసక్తి చూపించాను. కథ-కథనం-హీరోయిన్-డైరెక్టర్.. అన్నీ కొత్తగానే ఉంటాయి. నలుగురు కుర్రాళ్లు పిట్టగోడపై కూర్చుని తమ పేరు పేపర్లో పడాలని కలలు కంటారు. అంతలా ఎలా విజయం సాధించరాన్నదే సినిమా. ఈ మూవీలో అసలు హైలైట్ ఏంటటే.. పిట్టగోడ మూవీలో బ్లాక్ మనీ.. డీమానిటైజేషన్ కూడా ఉంటాయి' అంటూ ఆశ్చర్యపరిచారు సురేష్ బాబు.

'రెండేళ్ల క్రితం అనుదీప్ రాసుకున్న కథలో డీమానిటైజేషన్ ఉంది. ఇప్పటి సమయానికి తగినట్లుగా అప్పుడే కథ రాశాటన్న మాట. లక్కీగా అది కలిసొచ్చే విషయం అయింది మాకు. హ్యూమర్ తో పాటు రొమాన్స్ కూడా ఉన్నా ఎక్కడా వల్గారిటీ అనే మాట లేకుండా.. అందరూ కలిసి ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ పిట్టగోడ' అన్నారు సురేష్ బాబు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News