థియేట‌ర్లు తెరిచారు.. అంతా ఆయ‌న చెప్పిన‌ట్టే అయ్యింది!

Update: 2020-10-16 14:30 GMT
కేంద్రం అనుమ‌తిస్తే థియేట‌ర్లు తెరిచేస్తాం.. జ‌నాల్ని తోలేస్తాం!! అంటూ ఎగ్జిబిట‌ర్లు ఉబ‌లాట‌ప‌డినా జ‌నం అంత‌గా కంగారు ప‌డ‌రు! అని అగ్ర నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ డి.సురేష్ బాబు చాలా స్ప‌ష్ఠంగానే చెప్పారు. ఆయ‌న భ‌విష్య‌త్ ని దివ్యద‌ర్శ‌నంలో చూసి మ‌రీ చెప్పారు. జ‌నాల్లో కోవిడ్ భ‌యం ఇప్ప‌ట్లో పోద‌ని చిల‌క్కి చెప్పిన‌ట్టే చెప్పారు.

కానీ ఏదో హోప్. థియేట‌ర్లు తెరిస్తే జ‌నాల మైండ్ సెట్ మారి ఆ స‌గం సీట్లు అయినా నిండుతాయ‌ని ఆశించారు. కానీ అందుకు పూర్తిగా భిన్నంగా ఘోరాతి ఘోరంగా ఉంది రిజ‌ల్ట్. ఇప్ప‌టికే వైజాగ్ ఐనాక్స్ తెరిస్తే ఒక రోజు క‌లెక్ష‌న్ సుమారు 1500. నెట్ కేవ‌లం 1200 పై చిలుకు అని తెలిసింది. ఇది ఘోర‌మైన రిపోర్ట్. జ‌నాల్లో భ‌యాందోళ‌నలు ఇంకా త‌గ్గ‌లేదు అన‌డానికి సూచిక‌. చాలా థియేట‌ర్ల‌లో వసూళ్లు ఒక్కో ప్రదర్శనకు 1000 రూపాయల కన్నా తక్కువ. మల్టీప్లెక్సులు ఉన్న మాల్స్ కూడా దిగ్భ్రాంతికరమైన స్పందనతో అల్లాడాయి.

వైజాగ్ వరుణ్ ఐనాక్స్ స్క్రీన్ 6 లో `భీష్మ‌` సినిమా వేస్తే.. 3.35 PM ప్రదర్శన కోసం.. నలుగురు ప్రేక్షకులు వ‌చ్చారు. సుమారు 632 రూపాయల ఆదాయం అది.. సాధారణంగా అత్యంత రద్దీగా ఉండే 7 PM ప్రదర్శనకు కేవలం ఆరుగురు ప్రేక్షకులు వచ్చారు. సుమారు 948 రూపాయల ఆదాయాన్ని పొందారు. భీష్మ మొత్తం స్థూల ఆదాయం గురువారం వరుణ్ ఐనాక్స్ కి రూ .1580 కాగా.. మొత్తం నెట్ రూ .1239 అని తెలిసింది. సినీప్రియుల నుంచి జీరో స్పంద‌న‌పై ఎగ్జిబిట‌ర్లు ఖంగు తిన్నారు. క‌నీసం నిర్వహణ ఖర్చులు, ... విద్యుత్ బిల్లులు అయినా క‌ష్ట‌మే. ఇదే ధోరణి కొనసాగితే ఎక్కువ నష్టాలు ఎదుర్కోవలసి వస్తుందని ఎగ్జిబిటర్లు రన్నింగ్ పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. క్రిస్టోఫ‌ర్ నోలాన్ టెనెట్ కి సైతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేస్తే వ‌చ్చిన రిజ‌ల్ట కేవ‌లం 30 శాతం మాత్ర‌మే.
Tags:    

Similar News