క్యాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య ఇప్ప‌టిది కాదు:సురేష్ బాబు

Update: 2018-07-08 12:31 GMT
కొద్ది రోజుల క్రితం శ్రీ‌రెడ్డి-క్యాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం టాలీవుడ్ ను కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్య‌వ‌హారంలో ద‌గ్గుబాటి ఫ్యామిలీ పేరు ప్ర‌ముఖంగా వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే, దానిపై ప్ర‌ముఖ‌ నిర్మాత సురేష్ బాబు ఇప్ప‌టివ‌ర‌కు స్పందించ‌లేదు. అయితే, తాజాగా ఓ తెలుగు న్యూస్ చానెల్ ప్ర‌తినిధితో మాట్లాడిన సురేష్ బాబు ఆ వ్య‌వ‌హారంపై స్సందించారు. క్యాస్టింగ్ కౌచ్  - ఫేక్ న్యూస్ పై అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని... ఖండించ‌డం... దానిపై స్పందించ‌క‌పోవ‌డం వంటిదేమీ లేద‌ని...ఆ విష‌యాన్ని ఇండ‌స్ట్రీ - మీడియా స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేక‌పోయాయని అన్నారు. కొన్ని నెల‌లుగా టాలీవుడ్ లో డ్ర‌గ్స్ - క్యాస్టింగ్ కౌచ్ గురించి విప‌రీత‌మైన చ‌ర్చ జ‌రుగుతోందని - కాబ‌ట్టి మీడియాలో టాలీవుడ్ పేరు ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతోంద‌ని చెప్పారు. ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ - క్యాస్టింగ్ కౌచ్ వంటి విష‌యాలు చాలా సంవ‌త్స‌రాల నుంచి ఉన్నాయి. ప్ర‌తి ఇండ‌స్ట్రీలో ఉన్నాయన్నారు. కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల‌....ఆ వ్య‌వ‌హారం వెల్ల‌డ‌య్యే విధానం వ‌ల్ల అది మీడియాలో ఎక్కువ‌గా ఫోక‌స్ అవుతుందన్నార‌ను. ఇటువంటి స‌మ‌స్య‌లు ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని, కానీ వీడి వ‌ల్ల ఇండ‌స్ట్రీకి చెడ్డ‌పేరు వ‌చ్చిందా...మంచి పేరు వ‌చ్చిందా అన్న విష‌యంతో సంబంధం లేద‌ని...ఇండ‌స్ట్రీ గొప్ప‌ద‌ని....దాని ప‌ని అది చేసుకుపోతుంద‌ని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వంటి వ్య‌వ‌హారాల‌కు ఒకే రోజు చెక్ పెట్ట‌లేము....క‌ఠిన నిబంధ‌న‌లు విధించ‌లేము....ఎందుకంటే ఇవి మ‌నిషి పుట్టిన‌ప్ప‌టి నుంచి  ఉన్నాయి....సినీరంగంలోనే కాదు అన్నిరంగాల్లో ఇవి ఉన్నాయ‌న్నారు. చాలాకాలంగా.... మ‌ద్యపానం - క్యాస్టింగ్ కౌచ్ వంటి విష‌యాలు మ‌నిషి జీవితంలో భాగ‌మ‌య్యాయ‌న్నారు.

ఇపుడు సోష‌ల్ మీడియా...మీడియా...విస్తృతి పెరిగిపోయింద‌ని....కాబ‌ట్టి ఈ విష‌యాలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయ‌ని అన్నారు. పేప‌ర్లు మాత్ర‌మే ఉండే రోజుల్లో  ఏదో ఒక పేప‌ర్ మీడియా గురించి అవాస్త‌వాలు రాస్తే....వారిని ప‌క్క‌కు త‌ప్పించి మిగ‌తా వారితో సంబంధాలు కొన‌సాగించేవారిమ‌ని చెప్పారు. కానీ, ఇపుడు మీడియా - వెబ్ మీడియా - యూట్యూబ్ చానెల్స్ పెరిగిపోయాయ‌ని....చాలామంది వాస్త‌వాలు ఏమిటో తెలుసుకోకుండా.... ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తున్నార‌ని అన్నారు. అయితే, అస‌లు కొన్ని వెబ్ మీడియా సంస్థ‌ల‌ను ఎవ‌రు ర‌న్ చేస్తున్నారో తెలుసుకోలేమ‌ని...తెలిసినా....భార‌త్ వంటి ప్ర‌జాస్వామ్య దేశంలో ఇలా రాయొద్దు....ఇలా రాయి అని శాసించే ప‌రిస్థితి లేద‌ని అన్నారు. అయితే, త్వ‌ర‌లోనే సొసైటీలో ఒక మార్పు వ‌స్తుంద‌ని....దేనిని అంగీక‌రించాలి....దేనిని తిర‌స్క‌రించాలి అనే విష‌యాన్ని ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌ని అన్నారు.   హాలీవుడ్ లో కొంద‌రు జ‌ర్న‌లిస్టులు - మీడియా సంస్థల‌తో మాత్ర‌మే ప‌నిచేస్తామ‌ని సినిమా వారంతా....ఫిక్స‌య్యార‌ని...భార‌త్ లో అలా చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ని అన్నారు.


Tags:    

Similar News