ఆ రీమేక్ ని అగ్ర నిర్మాత‌ వెంకీతోనే తీస్తారా?

Update: 2021-09-08 04:51 GMT
త‌ళా అజిత్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఎన్నై అరిందాల్` కోలీవుడ్ లో భారీ విజ‌యాన్ని సాధించింది. అజిత్ ని కొత్త‌గా ప్రెజెంట్ చేసి.. స‌రికొత్త లుక్ తో ట్రెండ్ సెట్ట‌ర్ గా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్. అదే చిత్రాన్ని తెలుగులో` ఎంత‌వాడు గానీ` టైటిల్ తో అనువ‌దించారు. ఇక్క‌డా అజిత్ అభిమానుల మ‌న‌సు దోచింది. మ్యూజిక‌ల్ హిట్ సాధ్య‌మైంది.

ఈ చిత్రం విడుద‌లై ఆరేళ్ల‌కు పైగానే అవుతుంది. మాతృక‌లో ఈ చిత్రాన్ని ఏ.ఎమ్ ర‌త్నం- ఐశ్య‌ర్య సంయుక్తంగా నిర్మించారు. అదే నిర్మాత‌లు తెలుగులోనూ రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. రీమేక్ రైట్స్ ద‌గ్గుబాటి సురేష్ బాబు గ‌తంలోనే ద‌క్కించికున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఒక‌సారి రిలీజ్ అయిన సినిమాని మ‌ళ్లీ రీమేక్ రూపంలో తెస్తే.. అందులో వేరొక హీరో న‌టిస్తే స‌క్సెస్ రేటు ఎలా ఉంటుంద‌న్న‌ది చెప్ప‌డం క‌ష్ట‌మే. అయితే ఈ క‌థకు రీమేక్ స్కోప్ ఉంది. నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు మ‌లుచుకునే వెసులుబాటు ఉన్న క‌థాంశ‌మిది. ఓ వైపు క్రైమ్ పై పోలీస్ అధికారి ఉక్కుపాదం మోపుతూనే మ‌రోవైపు.. అంద‌మైన ల‌వ్ స్టోరీని న‌డిపించారు. పెళ్లై భార్య ఉన్నా అజిత్ ఎగ్రెస్సివ్ ప్రొఫెష‌నలిజాన్ని ఇందులో హైలైట్ చేసిన తీరు ర‌క్తి క‌ట్టిస్తుంది.

ఇలాంటి సినిమాలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తే బావుంటుంది. వెంకీ ఇంత‌కుముందు గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన కాఖా కాఖా రీమేక్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఘ‌ర్ష‌ణ టైటిల్ తో ఈ స్టైలిష్ కాప్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. చాలా కాలానికి గౌత‌మ్ మీన‌న్ సినిమాని తెలుగులో తీయ‌ల‌నుకుంటున్నారు కాబ‌ట్టి వెంకీనే బెస్ట్ ఆప్ష‌న్ అనుకోవ‌చ్చు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ అసుర‌న్ రీమేక్ నార‌ప్ప‌లో వెంకీ న‌ట‌న‌కు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పోతే ఎన్న‌య్ అరిందాల్ రీమేక్ లో న‌టించే హీరో ఎవ‌రు? అన్న‌ది డి.సురేష్ బాబు ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News