పవర్ ప్యాక్డ్ పెర్ఫామర్స్ గా సాయిపల్లవి కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తనతో సూర్య- జ్యోతిక లాంటి పవర్ ఫుల్ పెర్ఫామర్స్ జాయినయ్యారంటే విజువల్ ట్రీట్ ఏ రేంజులో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రానాతో కలిసి విరాటపర్వంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న సాయిపల్లవి ఇంతలోనే మరో క్రేజీ కాంబినేషన్ తో కలిసి నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా సూర్య .. సాయి పల్లవి ఇద్దరూ ట్విట్టర్ లో తమ తాజా చిత్రం గార్గికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. `గార్గి`లో సూర్య- జ్యోతిక చేరడం ఇండస్ట్రీ వర్గాలు సహా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ రోజు సూర్య- జ్యోతిక తమ ప్రొడక్షన్ హౌస్ 2డి పిక్చర్స్ సమర్పణలో తమిళంలో గార్గిని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. సమర్పకులుగా వ్యవహరిస్తూనే ఈ మూవీలో ఆ ఇద్దరూ నటిస్తున్నారు.
సూర్య తన ట్విట్టర్ లో వివరాలను తెలిపారు. జో & నేను టీమ్ తో అనుబంధం కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. #గార్గిలో కొన్ని పాత్రలు మన మనస్సులలో నిలిచిపోతాయి! కొత్త ఆలోచనలు రచనలు తప్పనిసరిగా చేయాలి! ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను! అని సూర్య రాసారు. సూర్య-జ్యోతిక తారాగణంలో చేరినందుకు సాయి పల్లవి చాలా ఆనందం వ్యక్తం చేసింది. ధన్యవాదాలకు @Suriya_offl సార్ #జ్యోతిక మ్యామ్.
శక్తిఫిలింఫ్యాక్టరీ -2D ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. అని తెలిపారు. ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. రవిచంద్రన్ రామచంద్రన్ - ఐశ్వర్య లక్ష్మి- థామస్ జార్జ్ - గౌతం రామచంద్రన్ నిర్మిస్తున్నారు. నటి ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది. గోవింద్ వసంత సంగీత స్వరకర్తగా పని చేసారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
సాయి పల్లవి చివరిసారిగా రానా దగ్గుబాటితో కలిసి విరాట పర్వం చిత్రంలో నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. 1990లలో జరిగిన వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందించిన చిత్రమిది. రానా కామ్రేడ్ రవన్న పాత్రను పోషించాడు.
అతడి కలం పేరు అరణ్య. సాయి పల్లవి వెన్నెల అనే గ్రామీణ యువతిగా రవన్న ఆరాధకురాలిగా కనిపించింది. ప్రియమణి- నందితా దాస్- నవీన్ చంద్ర- జరీనా వహాబ్- ఈశ్వరీ రావు- సాయి చంద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.